పటాన్ చెరు డివిజన్ ప్రజల ఆధార్ కార్డుకు సంబంధించిన పలు సవరణలు చేసుకోవడానికి వీలుగా ఆధార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ఇంచార్జీ రాజేందర్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని ఆర్జిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్, స్కూల్ మేనేజ్ మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆధార్ కార్డు నమోదు స్పెషల్ డ్రైవ్ ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.
ఆధార్ డ్రైవ్ లో కొత్తగా నమోదు, పాత వాటిలో తప్పులు సరి చేసుకోవడం, అడ్రస్, ఫోటోలను మార్చుకోవచ్చన్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఆర్జిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఆధార్ స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కరించు కోవచ్చని ఆయన తెలిపారు. ఈ ఆధార్ డ్రైవ్ నేటి నుండి 8వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 వరకు కొనసాగుతుందన్నారు.