Take a fresh look at your lifestyle.

వలస కూలీలకు అన్నదానం

కరోనా కొవిడ్‌19 ‌వైరస్‌ ‌లాక్‌ ‌డవున్‌ ‌వల్ల శ్రీ శివన్‌ ‌గురు స్వామీ ఆశ్శీసులతో రెండు దఫాలుగా గత 56 రోజులుగా నిర్విరామంగా అన్న ప్రసాదం అంది స్తున్న మన భద్రాద్రి హరిహర క్షేత్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం  బుధవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త   చావా లక్ష్మీనా రాయణ , ధనలక్ష్మి  ఆర్థిక సహ కారం తో వివిధ ప్రదేశాలు ఉన్న యాచకులు, అన్నార్తులకు సుమారు 100 మందికి అన్న ప్రసాద ప్యాకెట్లు ను అందించడం జరిగింది. ముందుగా దాతలు  చావా లక్ష్మీ నారాయణ  అన్న నైవేద్య కార్య క్రమం లో పాల్గొన్నారు.

అదేవి ధంగా రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల లో పనిచేస్తున్న ఒరిస్సా, మధ్య్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌వలస కూలీలకు వారి వారి రాష్ట్రాలకు తిరుగు పయనమై మన భద్రాచలం సరిహద్దు బ్రిడ్జి సెంటర్‌ ‌వద్ద ప్రభుత్వ చెక్‌ ‌పాయింట్‌ ‌వద్ద సుమారు 300 మందికి అన్న ప్రసాదాన్ని మరియు అన్నపాకెట్స్ ‌ను ఆలయ ప్రాంగణం లో అందిం చడం జరిగినది. మొత్తం గా  సుమారు 400 మందికి అన్నప్రసాధం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సాంబశివ శర్మ , అర్చకులు శ్రీనివాసా చార్యులు , ఆలయ కమిటీ సభ్యులు ఆర్‌ ఎస్‌ ఎన్‌ ‌రాజు , సీ హేచ్‌ ఎన్‌ ఎస్‌ ఎస్‌ ‌శర్మ ,  పరిమి శ్రీనివాస రావు , చారుగుళ్ల ఉమ మహేశ్వరరావు ,   పిల్లా ఈశ్వర్‌ ‌స్వామీ , వెంకటేశ్వర్లు( కొండబాబా), పీ వీ రావు (రిటైర్డ్ ఆర్‌ ‌టీ సి), వాసు ,  నేలటూరి రమణ, శ్రీనుబాబు  పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply