Take a fresh look at your lifestyle.

రైతు బంధు పథకాన్ని అమలు చేయాలి

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 21(ప్రజాతంత్ర విలేకరి): రైతుబంధు పథకాన్ని అమలుచేయాలని, పంటలకోసం భ్యాంకుల్లో  రైతులు చేసిన రుణాలు మాఫీ చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్‌ ‌చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పిలుపు మేరకు  రైతు బంధు పథకం అమలు చేయాలని రైతుల రుణమాఫీ  వెంటనే అమలు చేయాలని గురువారం నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా  కొల్లాపూర్‌ ‌పట్టణంలో కొల్లాపూర్‌ ‌బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయం ఇంచార్జి ఎస్‌ఎం ‌హుసేన్‌ ‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగినది.

ఈసందర్భంగా ఆపార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ ‌శేఖర్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రైతు బందు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారో అదే ప్రాతిపదికన ప్రస్తుతం మరియు కొత్తగా అర్హులైన  రైతులందరికీ ఐదు వేల రూపా యల చొప్పున రైతుల బ్యాంక్‌ ‌ఖాతాలో జమ చేయాలని అలాగే  ఎన్నికల ముందు  రైతులందరికీ లక్ష రూపాయల వరకు రుణా లు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చాక మరిపోయిందని విమర్శించారు.అధికారం చేపట్టి 18  నెలలు గడిచినా ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని, రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. కావునా లక్ష రూపాయలు కలిగిన రైతు రుణాలను వెంటనే మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలను ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడుసత్యనారాయణ గౌడ్‌, ‌ధనుజయ్‌ ‌గౌడ్‌,  ‌బిజెవైయం జిల్లా కార్యదర్శి కాశిపురం మహేష్‌ , ‌రమేష్‌ ‌రాథోడ్‌, ‌కురుమూర్తి ,శివశంకర్‌ ,‌హరీష్‌,‌రాఘవేంద్ర  తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply