Take a fresh look at your lifestyle.

సిరిసిల్లలో వరదలో కొట్టుకు పోయిన కార్మికుడు మృతి

  • పొలాల్లో శవాన్ని గుర్తించి పోస్ట్‌మార్టమ్‌కు తరలింపు
  • 4 లక్షల సాయం ప్రకటించిన మంత్రి కెటిఆర్‌

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో గల్లంతై మృతి చెందాడు. పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన గంగ కిషన్‌(35) అనే భవన నిర్మాణ కార్మికుడు మంగళవారం ఉదయం పని కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. రోడ్డుపై నుంచి పారుతున్న వరదలో నడుస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. అతను బుధవారం పొలాల్లో శవమై తేలాడు. ఉదయం వాకింగ్‌కి వెళ్లే వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కిషన్‌ ‌కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ ‌చేయూత నందించారు. మృతుడి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌జిందం కళ కిషన్‌ ‌భార్య సంధ్యకు చెక్కును అందజేశారు. అలాగే తన వంతు సహాయంగా మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కిషన్‌కు భార్య సంధ్య(34) తల్లి శాంతమ్మ (60) కుమారుడు రాము (12 )కూతురు లహరి (9) ఉన్నారు.

Leave a Reply