Take a fresh look at your lifestyle.

‘‘సాధారణం’’ అనే పదం అర్థం తెలియని ఓ స్త్రీ..

“సమాజంలో ఓ సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఓ సబ్జెక్టు సంబంధించి జీనియస్‌ ‌గా ఉన్న ఓ ఆడపిల్ల తన తల్లితో నేను నా తండ్రికి.. తండ్రిని అంటుంది. తల్లి ఆశ్చర్యపోయి అదేలా..? అని అడిగితే సంపాదించే వాడేగా నాన్న అంటే.. మన ఇంటిలో నేను సంపాదిస్తున్నాఅందుకే నేను నాన్నని అని క్లిస్టర్‌ ‌క్లియర్‌ ‌గా చెబుతుంది. ఆ సీన్‌ ‌మొత్తం సినిమాలో ఓ బ్యూటీ.. ఇది ఎందుకు బ్యూటీగా నిలుస్తుంది అంటే..? అది సమాజ సత్యం కనుక.. ఆ పాప తల్లి, ఆ పాపకి రోల్‌ ‌మోడల్‌ ‌కాకుండా ఆ పాపాయి శకుంతల దేవిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.. సినిమా లీడ్‌ ‌వుమన్‌ ‌తన ఎదుగుదల..జీవిత ప్రయాణంలో తన అస్తిత్వం.. డబ్బుకు ఉన్న ఇంపార్టెన్సు ఎప్పుడు మరిచిపోని వ్యక్తిగా సినిమా  ఆసాంతం కనిపిస్తుంది.”

శకుంతల దేవి సినిమా ద్వారా డైరెక్టర్‌ అను మీనన్‌ ‌చక్కగా చూపించారు

aruna senior journalist delhi
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

‘‘సాధారణం’’  అనే పదం అర్థం తెలియని ఓ స్త్రీ ఎలావుంటారో.. శకుంతల దేవి సినిమా ద్వారా డైరెక్టర్‌ అను మీనన్‌ ‌చక్కగా చూపించారు..బైయోపిక్స్ ‌లో వ్యక్తులను గ్లోరిఫైయ్‌ ‌చేసి చూపటం షరా మామూలు.. ఆడాళ్ళు అయితే.. వారు చేసే త్యాగం.. ఆ త్యాగాన్ని గ్లోరిఫైయ్‌ ‌చేసి చూపటం చూసి చూసి మెదడు వాచిపోయి ఉన్నవాళ్ళకి, శకుంతల దేవి సినిమా ఊరట. సమాజంలో ఓ సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఓ సబ్జెక్టు సంబంధించి జీనియస్‌ ‌గా ఉన్న ఓ ఆడపిల్ల తన తల్లితో నేను నా తండ్రికి.. తండ్రిని అంటుంది. తల్లి ఆశ్చర్యపోయి అదేలా..? అని అడిగితే సంపాదించే వాడేగా నాన్న అంటే.. మన ఇంటిలో నేను సంపాదిస్తున్నాఅందుకే నేను నాన్నని అని క్లిస్టర్‌ ‌క్లియర్‌ ‌గా చెబుతుంది. ఆ సీన్‌ ‌మొత్తం సినిమాలో ఓ బ్యూటీ.. ఇది ఎందుకు బ్యూటీగా నిలుస్తుంది అంటే..? అది సమాజ సత్యం కనుక.. ఆ పాప తల్లి, ఆ పాపకి రోల్‌ ‌మోడల్‌ ‌కాకుండా ఆ పాపాయి శకుంతల దేవిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.. సినిమా లీడ్‌ ‌వుమన్‌ ‌తన ఎదుగుదల..జీవిత ప్రయాణంలో తన అస్తిత్వం.. డబ్బుకు ఉన్న ఇంపార్టెన్సు ఎప్పుడు మరిచిపోని వ్యక్తిగా సినిమా  ఆసాంతం కనిపిస్తుంది. కేవలం శకుంతల దేవి లెక్కల తెలివిపై ఫోకస్‌ ‌పెట్టకుండా ఆమె ప్రాక్టీకాలిటీపై ఫోకస్‌ ‌పెట్టి సమాజంలో ఉన్న మహిళకు అను మీనన్‌ ‌మంచిగా న్యాయం చేసారు .

శకుంతల దేవి చుట్టూ ఉన్న ప్రపంచం యెంత ఇంపెర్ఫెక్ట్ ‌గా వుంది అనేది చక్కగా సినిమా ఆసాంతం డైరెక్టర్‌ ‌గా అను మీనన్‌  ‌చక్కగా క్యారీ చేసారు..సినిమాలో లీడ్‌ ‌వుమన్‌  ‌జీవితంలోకి వచ్చిన ప్రతి మగ పాత్రలతో ఆమె మాటాడే ప్రతి డైలాగ్‌ ‌వాట్‌ ఈజ్‌ ‌నార్మల్‌..?  అనే ప్రశ్నని చక్కగా అడిగినట్టు ఉంటాయి. అలాగే లీడ్‌ ‌వుమన్‌ ‌కూతురు పాత్రలో సమాజం జొప్పించిన బోన్సాయ్‌ ‌మనస్తత్వం ఓ జీనియస్‌ ‌ని ఎలా ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.. అనేది కూడా మన ప్రేక్షకులం సినిమాలో చూస్తాం. అలాగే లీడ్‌ ‌వుమన్‌ ‌తన కంటిలో కరకు.. కన్నీరు.. నిండుతుండగా ‘‘నేను ఎప్పుడు ఓడిపోను’’ అని తన కష్టాన్ని చెబుతూ ఉంటుంది. ఇవన్నీ అను మీనన్‌ ‌డైరెక్షన్‌ ‌మెళుకువలు మెరుపు జిలుగులు. లీడ్‌ ‌వుమన్‌ ‌తన జీవితంలో విజయాన్ని ఓ మహిళగా చూడాలి మహిళ గానే ఆ విజయాన్ని ఆస్వాదించాలి అనే ఆకాంక్ష కలిగి ఉంటుంది..ఈ ఆకాంక్షకి పునాది తన ఇంటిలో చవి చూసిన పితృస్వామ్య భావజాలం వలన లీడ్‌ ‌వుమన్‌ ‌చిన్నప్పుడు అక్క పాత్ర  అంటుంది.. ‘‘నువ్వు ఓ రోజు పెద్ద మగాడివి కావాలి’’ అని.. దానికి బాల్య పాత్రలో ఉన్న లీడ్‌ ‌వుమన్‌ ‘‘‌నేను పెద్దా మహిళను ఐతా నిన్ను బాగా చూసుకుంటా’’ అని బదులు పలుకుతుంది.. మహిళగా విజయం చూడటం దాన్ని ఆస్వాదించటం యెంత కష్టం అనేది సినిమాలో చక్కగా క్యారీ అయ్యింది. ఇక లీడ్‌ ‌వుమన్‌ ‌కి తన తల్లి మీద కోపం ఉండి ఆమె  జీవిత ప్రయాణంలో అది ద్వేషంగా మారిపోతుంది. అది అలాగే లీడ్‌ ‌వుమన్‌ ‌మనసులో క్యారీ అవుతూ తనకూతురి రూపంలో సమాజంలోని పితృస్వామ్య భావజాలం తన వయసు వడికిపోతున్నప్పుడు నిప్పులాగా తాకుతున్నప్పుడు.. లీడ్‌ ‌వుమన్‌ ‌తన తల్లిని క్షమించ గలుగుతుంది.
ఆ సమయం సరికి లీడ్‌ ‌వుమన్‌ ‌కూతురు కూడా మాతృత్వ ఛాలెంజెస్‌ ఎదుర్కొంటున్న సమయం ఆసన్నమై..తన తల్లి అయిన లీడ్‌ ‌వుమన్‌ ‌ని తప్పుగా అర్ధం చేసుకున్నా అని తెలుసు కుంటుంది.. ఆసరికే ఎన్నో సార్లో ఫోన్‌ ‌చేసి ఎంతకీ ఫోన్‌ ఎత్తని కూతురు ఓ చూపుకి నోచుకోని లీడ్‌ ‌వుమన్‌ ‌తపనలో.. తన సొంత కూతురుని ఓ పాలి చూడడాన్ని కొనుక్కోవాలి అనుకుని.. మొత్తం ఆస్తి కూతురుకి దక్కకుండా ఓ నాటకం ఆడి కూతురు ప్రేమను తన ఆస్తితో కొనుక్కుంటుంది.. సినిమా కేవలం లెక్కల గందరగోళంగా లేకుండా.. పితృస్వామిక భావజాల సమాజంలో ‘వెల కట్టలేని ప్రేమ వెల ఆస్తి’.. అని తెలిపేదిగా  లెక్కల జీనియస్‌ ‌శకుంతలా దేవి సినిమా ముగుస్తుంది.. విద్యాబాలన్‌ ‌నటనలో కొంచం రోటీనిజమ్‌ ‌కనిపించింది..అయితే కనుచూపు మేరలో ఈ సినిమా లీడ్‌ ‌వుమన్‌ ‌పాత్ర చేయగలిగేవారు మన మనసులో మెదలక పోవటం వలన విద్య బాలన్‌ ‌తో మన ప్రేక్షకులం అనివార్యంగా అడ్జెస్ట్  అవుతాం. అధిక రివ్యూలలో ఓ ఆన్‌ అపాలజెటిక్‌ ‌మహిళ కథని అను మీనన్‌ ‌తీశారు అన్నట్టు ప్రెజెంట్‌ ‌చేస్తున్నారు.. నిజానికి అను మీనన్‌ ‌ప్రస్తత మరుగుజ్జు సమాజం వలన ఓ లెక్కల జీనియస్‌ అయిన లీడ్‌ ‌వుమన్‌ ‌జీవితంలో ఏక విలన్‌ ‌పాత్ర ధారి లేకున్నా ఎలా మనసు భాదలు అనుభవించారు.. అనేది అను మీనన్‌ ‌తన డైరెక్షన్‌ ఆర్ట్ ‌ద్వారా చక్కగా  చూపారు.. ఇలాంటి సినిమాలు యెంత ఎక్కువ వస్తే అంతగా మన సమాజం మరుగుజ్జుతనం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.. సమస్య కనిపిస్తేనే కదా.. సమస్యకి సొల్యూషన్‌ ‌వెతుకుతాం..కనుక ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అని ఆశిద్దాం..
అరుణ, జర్నలిస్టు.. న్యూ దిల్లీ

Leave a Reply