Take a fresh look at your lifestyle.

‘‌చలో సూరమ్మ’ చెరువు సందర్శన భగ్నం

తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్చకు బిన్నంగా రాజరిక పాలన నడుస్తోందని ఆకాలంలోకూడా ఇంత నిర్బందంలేదని, రెండేండ్ల కిందట మంత్రి హరీష్‌రావు సూరారం చెరువుకై భూమిపూజ చేశాడని అక్కడి పరిస్థితిని తెలుసుకోవడానికే చలో సూరారం పిలుపునిస్తే నిర్బందాలకు గురిచేయడం ఆప్రజాస్వామికమని, స్వేచ్ఛకు భిన్నంగా పాలన సాగుతోందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ ‌రెడ్డి గృహనిర్బందంలోనే విమర్శించారు. సోమవారం కథలాపూర్‌ ‌మండలంలో గల సూరమ్మ చెరువు సందర్శనకు జీవన్‌ ‌రెడ్డి వెళ్తుండగా పోలీసులు ఆయనను ఇంటినుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకొని హౌస్‌ అరెస్టు చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వ పాలనను నిరసించారు. ఈసందర్భంగా జీవన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా శాంతి యుతంగా ప్రాజెక్టులో నిర్మాణాలను పరిశీలించి అందులో జరుగుతున్న అవినీతిని, జాప్యాన్ని ప్రజలకు తెలిపేందుకు పోతుంటే పోలీసులతో అడ్డగించడం అన్యాయమని అన్నారు. ఏ చట్ట నిబందనను బట్టి మమ్ములను అడ్డుకుంటున్నారని జీవన్‌ ‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.

ఏకార్యక్రమం చేపట్టినా అడ్డుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది ఈపరిస్తితులను చూస్త్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అని అనుమానం వేస్తోందన్నారు. . పోలీస్‌లను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాడే హక్కు లేదా,అని జీవన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ఓ దశలో అసహానానికి గురైన జీవన్‌రెడ్డి నా ఇంటిముందే పికెటింగ్‌ ఏర్పాటు చేస్తే మంచిదికధా అని వ్యంగంగా మాట్లాడారు. సాగునీటిలో కొన్ని ప్రాంతాలు వివక్షతకు గురవుతున్నాయని అన్నారు. ప్రాణహిత నదికి నది పరివాహక ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల హక్కు ఉంటుందనీ, తుమ్మిడిహెట్టికీ మహారాష్ట్ర తో ఒప్పందం కుదుర్చుకున్నా పూర్తి చేయకపోవడంతో ఈ జిల్లాలు సాగునీరు లేక ఎడారిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్‌ ‌మానేరు నీటిని నర్మాల ప్రాజెక్ట్ ‌కి తరలించడంలో వివక్ష చూపుతున్నారని, నీటిని తరలించడంలో 6 సంవత్సరాలు గడిచిన పురోగతి లేదని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని మెడిపల్లి ,కథలపూర్‌ ‌మండలాల్లోని 50వేల ఎకరాలకు సాగు నిరందించే కలికోట సూరమ్మ చెరువు ను 2 సంవత్సరాల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి హరీష్‌ ‌రావు శంఖుస్థాపన చేశారనీ ఇప్పటికీ తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని విమర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ ‌రివర్స్ ‌పంపింగ్‌ ‌తో ప్రజలపై అదనపు భారం పడుతుందని, వరద కాలువ నీటిని కాకతీయ కాలువకు లింక్‌ ‌చేస్తే డి 74 నుంచి డి94 వరకు 25 టీఎంసీ ల అదనపు నీరు నిల్వతో ఎస్సారెస్పీపై భారం తగ్గి శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నీటితోనే పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరంది అదనంగా ఆయకట్టు సాగులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి బండ శంకర్‌, ‌మాజీ మున్సిపల్‌ ‌చైర్మన్లు తాటిపర్తి విజయలక్ష్మి, గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌మాన్సూర్‌ అలీ , మున్సిపల్‌ ‌ఫ్లోర్‌ ‌లీడర్‌ల్ ‌దుర్గయ్య, మాజి వైస్‌ ఎం‌పిపి గంగం మహేష్‌, ‌నాయకులు దేవేందర్‌ ‌రెడ్డి, గాజుల రాజేందర్‌, ‌బింగి రవి, పులి రాము, నరేష్‌ ‌గౌడ్‌, ‌రఘువీర్‌ ‌గౌడ్‌, ‌నరేష్‌, ‌తాడెపు రమణ, వెంకటేష్‌, ‌గుండ మధు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడలో పొన్నం, ఆది శ్రీనివాస్‌ల అరెస్ట్
‌సిరిసిల్ల ప్రతినిధి : రుద్రంగి మండల శివారులోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌పార్టి తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.కలికోట ప్రాజెక్టుకు వెళ్లే దారులన్ని మూసివేయడంతో పాటు వివిధ ప్రాంతాలనుండి వచ్చే కాంగ్రెస్‌ ‌పార్టి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాంగ్రెస్‌ ‌పార్టి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌,‌వేములవాడ నియోజక వర్గ కాంగ్రెస్‌ ‌పార్టి ఇంచార్జి ఆది శ్రీనివాస్‌,‌పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి,నాయకులు పొదుపొడిపు లింగారెడ్డి,ముడికె చంద్రశేఖర్‌,‌చిలుక రమేశ్‌,‌తూము మధు,వకుళాభరణం శ్రీనివాస్‌,••రుణాకర్‌,‌రంగు వెంకటేశ్‌లతో పాటు పలువురిని వేములవాడలో పోలీసులు అరెస్ట్ ‌చేశారు.ఇదే సమయంలో సిరిసిల్లలో జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టి అధ్యక్షుడు నాగుల సత్యనా రాయణ గౌడ్‌,‌పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్‌ ‌తదితరలను అరెస్ట్ ‌చేశారు. ఈ సందర్భంగా వేములవాడ లో పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ కలికోట సూరమ్మ ప్రాజె క్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని,కాని సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌,‌కొండ పోచమ్మ ప్రాజెక్టులు శరవేగంతో పూర్తి చేశారని విమర్శించారు.కలికోట ప్రాజెక్టును ఎందుకు త్వరితగతిన పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించడానికి యత్నిస్తే అరెస్ట్‌లను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని,ప్రజాస్వామ్య విధానాలక తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాధినేత కెసిఆర్‌ ఇప్పటి కైనా తన విధానాలను మార్చుకోవాలని కోరారు.ఈ సమావేశంలో ఆది శ్రీనివాస్‌,‌పొద్దుపొడుపు లింగారెడ్డి,తూము మధు తదితరులు మాట్లాడారు.

Leave a Reply