Take a fresh look at your lifestyle.

ఒక వైరస్‌..అనేక పాఠాలు

“ప్రజాస్వామ్యంలో పౌరుల పాత్ర కీలకమనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం దొరికింది. మనిషిలో దాగి ఉన్న మానవత్వం పొంగిపొర్లుతొంది. వ్యక్తులు, వ్యవస్థలు దాతృత్వంలో పోటీపపడుతున్నాయి.  కొందరు డబ్బు రూపంలో, మరికొందరు సేవ రూపంలో, ఇంకొదరు నిత్యావసర వస్తు రూపంలో తోచిన సాయం చేస్తున్నారు. మానవకేంద్రంగా నడిచే సమాజములో ఒక మనిషి మాత్రమే మరొక మనిషికి సహాయం చేయగలరు కాని మరేమీ కాదనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.”

మనది భిన్న మతాలు, కులాలు, సంస్క•తులు, భాషలు కలగలసిన దేశం. అయితే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది అది ఇలాంటి విపత్కర పరిస్థితులలో బయటపడుతుంది. మనమంతా భారతీయులం అనే భావనను చాటి చెప్తుంది. ప్రస్తుతం మనం అదే పరిస్థితిలో ఉన్నాం. వైరస్‌ ‌మనల్నందరినీ ఒక్కటి చేసింది దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వైరస్‌కు కుల, మత, బాషా, లింగ భేదాలు తెలియవు కదా అదే అందరినీ ఒక్క తాటిమీదకు తెచ్చింది అని చెప్పవచ్చు. రెండవది, ముఖ్యమైనది వాతావరణ సమతుల్యత. కరొనా జాతికి సంబంధించిన ఫ్లూ వైరస్‌లు మనకు కొత్త కాకపోయినా ఇప్పుడున్న దాని తీవ్రతకు మాత్రం దానిలో కలిగిన జన్యుపరమైన మార్పులు లేదా ఉత్పరివర్తనాలు కారణం అన్నది జీవశాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే అటువంటి జన్యు ఉత్పరివర్తిత ప్రేరేపక కారకాలు మాత్రం వాతావరణంలో కలిగే మార్పులు అనేది కాదనలేని సత్యం. ఉష్ణోగ్రత, వర్షపాతంలో అసమతుల్యత మరియు వాయుకాలుష్యం వంటి మానవనిర్మిత చర్యలే ఇటువంటి కొత్త వైరస్‌ల పుట్టుకకు కారణం అవుతాయి. సాధారణంగా సూక్శ్మజీవులలో అత్యధికశాతం వివిధ వృక్ష మరియు జంతు జాతుల మీద ఆధారపడి జీవిస్తాయి. అయితే జీవవైవిధ్యంలో కలిగే అసమతుల్యత జీవులు ఇతరత్రా అనుకూలనాలు ఏర్పరుచుకునుటకు దోహదపడతాయి. పరిస్థితి చేయిదాటినపుదు ప్రకృతి తనంతట తానే సర్దుబాటు చేసుకుంటుంది.

మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎన్నో ఏళ్ళుగా భారతదేశంలో కులం, మతం, దేవుడు వంటి మూఢనమ్మకాలు అభివృద్ధి నిరోధకాలుగా ఉన్నాయి. శాస్త్రీయ ధృక్పథాన్ని, తార్కిక ఆలోచనను, పరిశొధనా వైఖరులను చంపివేసే కాలం చెల్లిన భావజాలానికి కనీసం తాత్కాలికంగానైనా బ్రేక్‌ ‌పడింది. ఎందుకంటే దాదాపు అన్ని మతాల ప్రార్థనా మందిరాల తలుపులు మూసుకున్నయి. ఇటువంటి విపత్కర పరిస్థితిలో కేవలం విజ్గానం, విచక్షణ, క్రమశిక్షణ మాత్రమే సమాజ రక్షణకు తోడ్పడుతాయి కానీ నమ్మకాలు కావనే నగ్నసత్యాన్ని గ్రహించాడనికి ఒక కారణం అయ్యింది అని చెప్పవచ్చు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలను కూడా భగవంతునికో, బలవంతునికో ముడిపెట్టే ఖర్మభూమిలో మొదటిసారిగా ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకునేందుకు మరియు అధ్యయనం చేసేందుకు ఒక ఆవశ్యకతను కరొనా వైరస్‌ ‌కలిగించింది. యాక్టర్లు కాదు డాక్టర్‌లే ప్రాణదాతలు అనే విషయాన్ని తెలిపాయి. పొలీసులు, పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ప్రపంచానికి తెలిసివచ్చింది. పేద ధనిక, నలుపు తెలుపు అనే తేడా లేకుండా సామాన్యుని నుండి దేశ ప్రధాని వరకు అందరూ సమానమేనని భౌతిక నియమాలు అందరికీ వర్తిస్తాయని నిరూపించింది.

ఇకపోతే ఈ వైరస్‌ ‌మానవుని సామాజిక ప్రవర్తనలో కొన్ని మౌలికపరమైన మార్పును తీసుకువచ్చింది. పాపానికి, నేరానికి, పవిత్రతకు పరిశుభ్రతకు తేడా తెలియని సమాజానికి మొదటిసారిగా వ్యక్తిగత పరిశుభ్రత, కమ్యూనిటీ పరిశుభ్రత మీద అవగహన కల్పించింది. సాధారణంగా ఒక క్యూలైన్లో కనీస దూరాన్ని పాటించకుందా ఒకరిమీద ఒకరు పడి పడి నిల్చొనే మన పౌరులు హుందాగా ఒక మీటర్‌ ‌దూరంలో చక్కగా నిల్చుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుల పాత్ర కీలకమనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం దొరికింది. మనిషిలో దాగి ఉన్న మానవత్వం పొంగిపొర్లుతొంది. వ్యక్తులు, వ్యవస్థలు దాతృత్వంలో పోటీపపడుతున్నాయి. కొందరు డబ్బు రూపంలో, మరికొందరు సేవ రూపంలో, ఇంకొదరు నిత్యావసర వస్తు రూపంలో తోచిన సాయం చేస్తున్నారు. మానవకేంద్రంగా నడిచే సమాజములో ఒక మనిషి మాత్రమే మరొక మనిషికి సహాయం చేయగలరు కాని మరేమీ కాదనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.

ఇకపోతే మద్యం, జూదం వంటి దురలవాట్లతొ పనీ పాట లేకుండా జులాయిగా తిరిగే చిల్లరగాళ్లను కూడా కరొనా దారికి తెచ్చింది. అందరూ చక్కగా కుటుంబంతొ గడపుతున్నారు..ఇంటి పనుల్లో, వంట పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంటిలో ఉంటూ కూడా ఆఫీస్‌ ‌పని చేయవచ్చునని తెలిసివచ్చింది. పుస్తకాలు చదవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోధనాభ్యసన ప్రక్రియలో నూతన ఒరవడులను చూడ గల్గుతున్నం. అభ్యసన ప్రక్రియ ఆధునిక టెక్నాలజీని ఆలింగనం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ సామాజిక మార్పు కరొనా తరవాత కూడా ఇలాగే కొనసాగుతూ సాంఘిక, నైతిక క్రమశిక్షణనే సామాజిక పురోగతికి ప్రజాస్వామ్య విజయానికి దోహదం చేస్తాయని ఆశిద్దాం.

– పరమేష్‌ ‌గోషాల,
అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌

Leave a Reply