Take a fresh look at your lifestyle.

వెలకట్టలేని మానవత్వం దయాగుణం

“‌ప్రపంచంలో అశాంతి పెరిగిపోతున్నది. అన్ని దేశాలను   ఉగ్రవాదము భయాందోళనలకు గురిచేస్తున్నది. ఏ క్షణము లో ఎటునుండి ఏ ప్రమాదము పొంచి ఉందో తెలియని పరిస్థితి. ఏ ప్రమాదం ఎవరిని బలితీసుకుంటుందో తెలియటములేదు. ఈ సమస్యకు పరిష్కారము కనుక్కోవలసిన ఆవశ్యకత ఉంది. ప్రపంచమంతా ఒక్కటే, అంతటా మానవులే, సృష్టి పరముగా అంతగా తేడా లేకున్నా కృతిమంగా సృష్టించుకున్న తేడాలు మనుషులను విడదీస్తునాయి.”

ప్రపంచ దయ దినోత్సవాన్ని ఏటా నవంబర్‌ 13 ‌న జరుపుకుంటారు. ఈ రోజున,  వ్యక్తులు లేదా సంస్థలు మంచి పనులను జరుపుకోవడం మరియు పనులను ప్రోత్సహించడం మరియు దయగల చర్యలను చేపట్టడానికై ప్రతిజ్ఞ చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి కృషి చేయడం జరుగుతుంది. ప్రపంచ దయ దినోత్సవాన్ని మొట్ట మొదటగా 1997 టోక్యో సమావేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దయగల సంస్థలు ఏర్పాటు చేసుకున్న సమావేశం ఫలితంగా, 1998 లో  ప్రపంచ దయ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం, మతం మరియు  రాజకీయ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని ఈ  ప్రపంచ దయ ఉద్యమంలో ప్రస్తుతం 28 కి పైగా దేశాలు ఉన్నాయి. ప్రపంచ దయ ఉద్యమం మరియు ప్రపంచ దయ దినం యొక్క ప్రధాన లక్ష్యం వ్యక్తులు మరియు దేశాలను  జాలి, సేవ దృక్పథం వైపు ప్రేరేపించడం ద్వారా ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించడం.

ప్రపంచంలో అశాంతి పెరిగిపోతున్నది . అన్ని దేశాలను   ఉగ్రవాదము భయాందోళనలకు గురిచేస్తున్నది . ఏ క్షణము లో ఎటునుండి ఏ ప్రమాదము పొంచి ఉందో తెలియని పరిస్థితి. ఏ ప్రమాదం ఎవరిని బలితీసుకుంటుందో తెలియటములేదు . ఈ సమస్యకు పరిష్కారము కనుక్కోవలసిన ఆవశ్యకత ఉంది . ప్రపంచమంతా ఒక్కటే, అంతటా మానవులే , సృష్టి పరముగా అంతగా తేడా లేకున్నా కృతిమంగా సృష్టించుకున్న తేడాలు మనుషులను విడదీస్తునాయి . తమకు తాముగా సృస్టించుకున్న తేడాల్ని మూర్ఖం గా అనుసరిస్తూ ఇతరుల ఆలోచనా విధానాలను అంగీకరించని మనస్తత్వం పెరిగినందునే మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందనేది వాస్తవం.

జాలి , దయ , సహనము , కరుణ , కోపము , ఈర్శ్య , ఆందోళన అన్నీ కూడా మానవుల్లో ఉండే వివిధ కోణాలు . విభిన్న పరిస్థితుల్లో వివిధ రూపాల్లో ప్రతిస్పందించడం మానవ నైజము . అయితే వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే మరి కొన్ని ప్రతికూల ధోరణి స్పందనలు . శాంతము గా తోటివారికి సాయపడే గుణము కలిగి ఉండడం గొప్ప అంశం. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలన్న కరుణాభావం పరిసరాలన్నింటినీ పర్వదినం గా మార్చగల అపూర్వ శక్తిని కలిగివుంటుంది . దేశ సరిహద్దులు , సంస్కృతులు , కులము ,మతము , జాతి అన్నవేమీ లేకుండా మనమందరం ప్రపంచ పౌరులమన్న భావన కలిగి ఒకరి పై ఒకరు దయాభూత గుణము  కల్గి ఉండాలనే  చేసే ప్రయత్నమే ఈ ప్రపంచ దయాగుణ దినోత్సవం ముఖ్య ఉద్దేశము. లేనివాడికి తగిన రీతిలో మనకున్నది కొంతలో కొంత ఇచ్చి సహాయపడడమే దయాగుణము . కస్టములో ఉన్నవారికి కొన్ని మంచి ఓదార్పు మాటలు ఎంతో ఊరటనిస్తాయి . ప్రపంచీకరణ ప్రజలను దగ్గరికి తెచ్చింది . అన్నింటా ఓ తోడు , మన పక్క నున్నవారు అవసరం వస్తే సాయపడరారన్న చిన్ని ఆశ చాలు బ్రతుకు తెరువు లో ఎంతోభారము తగ్గిపోతుంది . చిన్ని చిన్ని అవసరాలు , చిన్నపాటి మాటతో లభించే సాంత్వన చాలు ఎదుటివారికి , మనకు సంతృప్తిని , శాంతిని కలిగిస్తుంది.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply