Take a fresh look at your lifestyle.

సమైక్య జీవనప్రస్తానం !

నిత్య మాస్క్ ‌ధారణతో
సానీటైజర్‌ ‌చిలకరింపుతో
సామాజిక దూర పాటింపుతో
నియమ,నిబంధనల ఆచరణతో
కొరోనాను తప్పక కట్టడి చేసేస్తాం
కానీ అంతటితో ముప్పు తప్పినట్లు
పాప ప్రక్షాలనమైనట్లు తలిస్తే తగదు

ఇది ఆషామాషి ఆపద కాదు
గాలివాటు విపత్తు అసలే కాదు
తరాల మానవ తప్పిదాల పలితం
యుగాల అనాగరిక చేష్టల పరిహారం

రేపు కొత్త వైరస్‌ ‌పుట్టుకురావొచ్చు
రెట్టింపు స్థాయిలో విరుచుకపడొచ్చు
మనిషి ఆనవాలు మాయం చేయొచ్చు
ఏకంగా లోకాన్ని ఎడారిగా మార్చొచ్చు
అందుకే …!

అస్తిత్వం సుస్థిరమవాలంటే
విశ్వ జగతి విలసిల్లాలంటే
వికృత వినాశకర వైఖరి వీడి
మరో మనిషిగా రూపునెత్తాలి

అడవులను కాపాడుకోవాలి
పర్యావరణాన్ని పరిరక్షించాలి

పక్షుల స్వేచ్ఛగా ఎగరనివ్వాలి
సకల జీవులను బతకనివ్వాలి

జలాశయాల ఉప్పొంగించాలి
ఇలాతలం పచ్చదనం పరచాలి

పుడమి తల్లిని ప్రేమించాలి
ప్రకృతి మాతను పూజించాలి

ఉన్నత విలువల దారిలో …
సమైక్య జీవన ప్రస్తానం సాగించాలి
– కోడిగూటి తిరుపతి :9573929493

Leave a Reply