Take a fresh look at your lifestyle.

మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య

తాండూర్‌ : ఓ ‌ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్‌ఐ ‌విట్టల్‌ ‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలం ముకుందపుర్‌కు చెందిన అశోక్‌ అదే గ్రామానికి అలివేలు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం అశోక్‌ ‌వివాహం చేసుకున్నాడు. అయితే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో తల్లిదండ్రులు మంచిది కాదని అలివేలును మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అలివేలు రాత్రి సమయంలో అందరూ నిద్రించి ఉండగా దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసుకున్న అశోక్‌ ‌వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ఇరువురి కుటుంబాలకు అప్పజెప్పారు. దీంతో గ్రామంలోని ఇరువురి కుటుంబంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply