Take a fresh look at your lifestyle.

మొత్తం 205 మంది సిబ్బంది ..హాజరు 61..!

  • సరిపడా డాక్టర్లు లేకుండానే ఏరియా హాస్పిటల్‌ ‌నిర్వాహణ..
  • 15 బెడ్‌లతో క్వారంటైన్‌ ‌సెంటర్‌
  • ‌కేసీఆర్‌కు భగవంతుడు బుద్ధి ప్రసాదించాలి 
  •  కొరోనా బాధితులను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం  
  • భద్రాచలం ఏరియా హాస్పిటల్‌ ‌సందర్శనలో భట్టీ

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా ప్రభావం రోజురోజుకు విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలను బలిగొంటునప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాత్రం ఫామ్‌హౌస్‌ ‌వదిలి బయటకు రాకుండా బాధితుల ప్రాణాలను గాలికి వదిలేసారని సిఎల్‌పి నేత మల్లు భట్టీ విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. బుధవారం నాడు సిఎల్‌పి బృందం భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య ఆధ్వర్యంలో భద్రాచలం ఏరియా హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు. హాస్పిటల్‌లో ఉన్న కోవిడ్‌ ‌పేషెంట్లను ఆయన కలిసి మాట్లాడారు. అలాగే హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌యుగంధర్‌తో మాట్లాడారు. కొరోనా బాధితులకు ఇస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం హాస్పిటల్‌ ‌ప్రాంతం అంతా తనిఖీ చేసారు. ఏజన్సీలో అతిపెద్ద హాస్పిటల్‌ ‌భద్రాచలంలోనే ఉందని భద్రాచలం డివిజన్‌ ‌వ్యాప్తంగా కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌నుండి అనేక మంది రోగులు వస్తుంటారని హాస్పిటల్‌లో చూస్తే డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని కొరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికి డాక్టర్లను నియమించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

 A total of 205 staff..Attendance 61

16 మంది సివిల్‌ ‌సర్జన్‌ ‌కోర్సులు ఖాళీగా ఉన్నాయని, డిప్యూటి సర్జన్‌ 8 ‌ఖాళీలు ఉన్నాయని, మొత్తం 47 మంది డాక్టర్లు కొరత ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కొరోనా బాధితులు ఈ హాస్పిటల్‌కి వస్తే ఏ విధంగా కాపాడతారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌  ‌ప్రజలకు మాయమాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప కొరోనా బారిన పడిన బాధితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కి ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ ‌నిధులు అందుబాటులో ఉన్నప్పటికి డాక్టర్లను నియమించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని  విమర్శించారు. దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఉందని విమర్శించారు. కొరోనా బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసారు. ఇంత పెద్ద హాస్పిటల్‌కి 15 బెడ్‌లతో క్వారంటైన్‌ ఏర్పాటు చేయటం విచారకరమని అన్నారు. కొరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించిన తాము ప్రభుత్వానికి సూచనలు చేయటం జరిగిందని, ఖాళీగా ఉన్న హాస్పిటళ్లలో డాక్టర్లను నియమించాలని అవసరమైతే అదనంగా కూడ డాక్టర్ల నియామకం చేయాలని కోరటం జరిగిందని చెప్పారు.

అంతేకాకుండా కాలేజీలు, హోటల్స్‌ను ఐసోలేషన్‌ ‌వార్డులుగా తీసుకోవాలని చెప్పటం జరిగిందని తెలిపారు. కొరోనా భారిన పడిన బాధితులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయాలని అలాగే పిపిఏ కిట్లు అందచేయాలని తెల్లరేసన్‌ ‌కార్డులు లేనివారికి ప్రైవేటు హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కనీస ఫీజులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టమని , అలాగే ఐఏఎస్‌ అధికారుల బృందంతో ఎప్పటికప్పుడు ప్రైవేటు హాస్పిటళ్లను పరిశీలించే విధంగా కఠినమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి చెప్పినట్లు సిఎల్‌పి నేత భట్టీ విక్రమార్క చెప్పారు. అనంతరం ములుగు శాసన సభ్యులు సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొరోనా బాధితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటళ్లపై ఆంక్షలు పెట్టకపోవడం వలనే కొరోనా బాధితులకు లక్షలు రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని అన్నారు. వాటిని కట్టడి చేయటంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య, మాజీ జడ్‌పి చైర్మన్‌ ‌చందా లింగయ్య దొర మరియు కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply