Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1492 పాజిటివ్‌ ‌కేసులు కొరోనాతో 13 మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు గురువారం నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1492 మందికి పాజిటివ్‌గా నమోదయింది. కాగా, వైరస్‌ ‌నుంచి 1933 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 13 మంది మృతి చెందారు.

జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 166 కేసులు  నమోదవగా, ఖమ్మం జిల్లాలో 129 కేసులు, నల్గొండలో కొత్తగా 115 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,09,417 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,534కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,86,362 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 19,521గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply