Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1489 పాజిటివ్‌ ‌కేసులు కొరోనాతో 11 మంది మృతి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు బుధవారం క్రితం రోజుకన్నా గణనీయంగానే తగ్గాయి. మంగళవారం నమోదైన కేసులు 1556 కాగా బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1489 మందికి పాజిటివ్‌గా నమోదయింది. కాగా, వైరస్‌ ‌నుంచి 1436 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 11 మంది మృతి చెందారు.

జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 175 కేసులు నమోదవగా, నల్గొండలో 131 కేసులు, ఖమ్మం జిల్లాలో కొత్తగా 118 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,07,925 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,521కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,84,429 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 19,975గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply