Take a fresh look at your lifestyle.

ఉ‌క్రెయిన్‌లో ఘోర ప్రమాదం

హెలికాప్టర్‌ ‌కూలిన ఘటనలో హోమ్‌ ‌మంత్రి సహా 17 మంది దుర్మరణం

కీవ్‌, ‌జనవరి 18 : ఉక్రెయిన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కీవ్‌ ‌నగరంలోని బ్రోవరీ టౌన్‌ ‌కిండర్‌గార్డెన్‌ ‌సపంలో హెలికాప్టర్‌ ‌కుప్పకూలింది. ఈ ఘటనలో ఉక్రెయిన్‌ ‌హోంమంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. హోంశాఖ మంత్రి డేనిస్‌ ‌మోనాస్థిరిస్కీ సహా ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 10 మంది పిల్లలు సహా 22 మందికి హాస్పిటల్‌ ‌లో ట్రీట్‌ ‌మెంట్‌ ‌కొనసాగిస్తున్నారు. జనావాసాల మధ్య హెలికాప్టర్‌ ‌కుప్పకూలడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు. హెలికాప్టర్‌ ‌కుప్పకూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న బిల్డింగులకు మంటులు అంటుకోన్నాయి. ఘటనకు సంబంధించి సోషల్‌ ‌డియాలో వీడియోలు వైరల్‌ ‌గా మారాయి. మృతులు, బాధితుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply