Take a fresh look at your lifestyle.

అమరజవానుకు కన్నీటి వీడ్కోలు

దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్ బాబు అమర్ రహే అనే నినాదాలతో సూర్యాపేట హోరెత్తిపోయింది. నగరవీధుల మీదుగా కేసారం వరకు 2 గంటలపాటు ఆయన అంతిమయాత్ర జరిగింది. ప్రజలు, కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, నేతలు, ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం సమక్షంలో ఆయనకు సైనిక లాంఛనాలతో కన్నీటివీడ్కోలు ఇచ్చి జాతి నివాళులు అర్పించింది.
సంతోష్ బాబు సొంత వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ జరిగిన సైనిక సంస్కారాల్లో బీహార్ రెజిమెంట్ బృందం కూడా పాల్గొంది. వీర సైనికుడు సంతోష్ బాబు అంత్యక్రియల సందర్భంలో ఆయన మూడేళ్ళ కుమారుడు చేసిన సెల్యూట్ కంటతడి పెట్టించింది. ఆయన కుటుంబసభ్యులు చేసిన వందనం దేశంపట్ల వాళ్ళ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచి, ప్రజల్లో నిజమైన దేశభక్తిస్ఫూర్తిని రగిలించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!