తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్ కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, రెడ్డి ల్యాబ్స్, టి హబ్ లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో జర్నలిస్టు బృందానికి సమాచార శాఖ, జాయింట్ డైరెక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి నాగుళ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.