Take a fresh look at your lifestyle.

ఓ ఉపాధ్యాయుడా!

విద్యా సంపన్నుడా
విజ్ఞానపు వెలుగులను
కురిపించు భానుడా

విద్యార్థి లోకానికి మేధస్సు నీవు
దేశాన్ని వెలిగించు తేజస్సు నీవు
విశ్వానికి ఎంతో
విలువైన వాడవయ్య

విద్యార్థుల మానసిక మర్మము తెలిసిన
మా పిల్లల దోస్తు వయ్య
సమాజాన్ని నడిపించే
సంధానకర్త వయ్య

తల్లి వై తండ్రి వై
తలలో నాలుక వై
పసి హృదయాలలో బందీ వై
విజ్ఞానపు జ్యోతివైతి

మట్టి ముద్దలను
మణిదీపాలు గా మార్చే
మహిమాన్వితుడు వయ్యా
మా మంచి పంతులుయ్యా

శిలలను శిల్పాలుగా చేసే
చిత్రకారుడువయ్యాజి
క్రమశిక్షణ నేర్పే
కారణభూతుడు వయ్యా

పాఠశాల అనే విజ్ఞానపు తోటలో
అక్షర సేద్యము చేసి
విజ్ఞానం అనే ఇంధనం పోసి
విద్య అనే పంట తీసిన పండిత రైతు వయ్య

రాగాలతో పాడి
భావాలనే చెబితే
ఇంటి బాధలు వదలి
బడిలోన పిల్లల బాధలను మరిచరి

నిత్య విద్యార్థిగా నూతన ఉత్తేజంతో
పుస్తక పఠనం చేసి విద్యార్థుల ముందు
విజ్ఞాన వెన్నెలై కురిపించి, తాను కరుగుతూ
వెలుగులను విరజిమ్మే విద్య దేవుడు

ఉత్తమ విద్యను పొంది ఉద్యోగాలు చేస్తూ
ఉన్నతశ్రేణిలో ఉన్న వాళ్లు ఎంతో
గురువంటే దైవమై గుండెల్లో దేవుడై
బతుకు బాట వేసిన మా దీనజన బంధువు

ఓ ఉపాధ్యాయ నీ పాదపద్మములకు నమస్సులు నమస్సులు, నమస్సులు

ఓ విద్యార్థి ఢిల్లీకి నీవు రాజువైన
ఉన్నత పదవులపై ఉత్తిష్ఠడవైన
గురువుకు నీవు శిష్యుడవు అనే
గురుతుర బాధ్యత గుర్తెరిగి తిరగ రా

 – బి. రామయ్య,  9441174749

Leave a Reply