Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం
ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు
రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం
అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల
అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని, ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన భవనం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణకు ఇదో మకుటాయమానంగా నిలుస్తుందని ప్రకటించారు. చెప్పాలంటే ఇదో ఐకానిక్‌ ‌భవనంగా నిలుస్తుందని అన్నారు. కెసిఆర్‌ ‌దూరదృష్టికి ఇది నిదర్శనమని అన్నారు. మంత్రులు, అధికారులు ఒకేచోటు నుంచి పనిచేసేలా సచివాలయంలో ఏర్పాట్లు జరిగాయని అన్నారు. కేంద్రం నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ ‌విస్టాకన్నా మన సచివాలయం విశాలమైనదని అన్నారు. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన మన సచివాలయం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 20 నెలల్లోనే సచివాలయ నిర్మాణం సాకారమైందని అన్నారు. ముందు ప్రకటించిన విధంగా రేపు 30న అత్యంత వైభవంగా సచివాలయాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కేంద్రం నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ ‌విస్టా వైశాల్యం 6,98,270 చదరపు అడుగులు కాగా, మన సచివాలయాన్ని 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు.

A symbol of Telangana's self-respect telangana new secreteriat   మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత విశాలమైన, సవి•కృత సచివాలయం లేదు. గాలి, వెలుతురు ధారాళంగా వొచ్చే విధంగా డిజైన్‌ ‌చేయడంతో పాటు గదుల ఎత్తు కూడా 14 అడుగులుగా నిర్మించామని మంత్రి వేముల అన్నారు. ముందూవెనుక భాగంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోర్టికోల ఎత్తు 42 అడుగులు. కుతుబ్‌మినార్‌ ‌కన్నా ఎత్తైన మన సచివాలయంలో ఆరో అంతస్తులో 28 అడుగుల ఎత్తైన రెండు హాళ్లను నిర్మించారు. ప్రత్యేక అతిథులు, విదేశీ ప్రతినిధులతో సమావేశాలు, విందుల కోసం వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. లోవర్‌ ‌ప్లోర్‌, ‌గ్రౌండ్‌ ‌ప్లోర్‌ ‌తరువాత ఆరు అంతస్తులు కాగా, ప్రధాన డోమ్‌లు ఉన్నచోట భవనం 11 అంతస్తులుగా ఉంది. ప్రధాన డోమ్‌ల వైశాల్యం 2,500 చదరపు అడుగులు. డోమ్‌ల ఎత్తు 48 అడుగులు కాగా, వయా 50 అడుగులు. మొత్తం భవనంలో 34 డోమ్‌లను నిర్మించారు. సచివాలయానికి ఇరువైపులా మొత్తం 24 లిఫ్టులు ఉండగా, అందులో ఎనిమిది స్కైలాంజ్‌వరకు వెళ్లేలా ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. ఇండియన్‌ ‌గ్రీన్‌ ‌బిల్డింగ్‌ ‌కౌన్సిల్‌ ‌నుంచి గోల్డెన్‌ ‌సర్టిఫికెట్‌ ‌పొందిన గౌరవం కూడా మన సచివాలయానికే దక్కిందని తెలిపారు. భవనంలోని హాళ్లు, డోమ్‌లు, స్కైలాంజ్‌లు దేశంలోని ఏ ఇతర సచివాలయానికీ లేవని చెప్పారు. సచివాలయంలో మొత్తం 635 గదులు, 30 కాన్ఫరెన్స్ ‌హాళ్లను నిర్మించాం. మంత్రులందరికీ ప్రత్యేక చాంబర్లతోపాటు కాన్ఫరెన్స్ ‌హాళ్లను ఏర్పాటు చేశారు. విధుల్లో జాప్యం జరుగకుండా అన్నీ ఒకేచోట ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సవి•కృత సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు.

A symbol of Telangana's self-respect telangana new secreteriat

మంత్రులు, కార్యదర్శులు, సిబ్బంది ఒకేచోట ఉన్న సచివాలయం దేశంలో ఇదే మొదటిది. గతంలో ఒక్కొక్కరు ఒక్కో కార్యాలయంలో ఉండటంతో విధి నిర్వహణ, ఫైళ్ల  మూవ్‌మెంట్‌లో తీవ్ర జాప్యం జరిగేది. ఇక్కడ ప్లగ్‌ అం‌డ్‌ ‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు అవసరమైన సకల సౌకర్యాలు ఇందులో ఉంటాయి. సచివాలయానికి పునాదిరాయి వేసిననాడే సీఎం కేసీఆర్‌ ‌నాతోపాటు అధికారులను పిలిచి భవనానికి అవసరమైన సామగ్రిని ముందే కొనుగోలు చేయాలని, ఎటువంటి జాప్యం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో 20 నెలల్లోనే భవన నిర్మాణం పూర్తయింది. వాస్తవానికి పునాదిరాయి పడినప్పటినుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ ‌మాసాంతానికి 26 నెలలు అవుతుంది. ఇందులో కొవిడ్‌ ‌కారణంగా మూడు నెలలు, కోవిడ్‌ ‌వల్ల సొంత ఊళ్లకు వెళ్లిపోయిన కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో మూడు నెలల సమయం పట్టింది. ఇలా ఆరు నెలలు వృథా అయింది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాన్ని 20 నెలల్లో పూర్తిచేయడం రికార్డుగా చెప్పవచ్చు. ఏసీల ఏర్పాటుకు ఆరు నెలలు పట్టింది. ప్రధాన పిల్లర్లు, గుమ్మటాలకు ముందుగా పోతపోసిన నిర్మాణాల జీఆర్‌సీ పనులు కూడా బాగానే సమయం తీసుకున్నాయి. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ ‌మైన్‌ ‌నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెడ్‌ ‌శాండ్‌స్టోన్‌ను వాడారు. ముందుగా రాజస్థాన్‌లోని ఓ మైన్‌నుంచి ఈ రాయిని తెప్పించేందుకు ఒప్పందం చేసుకోగా, అదే మైన్‌ ‌నుంచి పార్లమెంటు నిర్మాణానికి కూడా రెడ్‌ ‌శాండ్‌ ‌స్టోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో మన సచివాలయం కోసం మరో మైన్‌ ‌నుంచి కొనుగోలు చేయాల్సి వొచ్చింది. సచివాలయ నిర్మాణంలో 3500 క్యూబిక్‌ ‌వి•టర్ల రెడ్‌ ‌శాండ్‌ ‌స్టోన్‌ను 1000 లారీల ద్వారా ఇక్కడికి తరలించారు.

A symbol of Telangana's self-respect telangana new secreteriat

చివాలయంలో రిసెప్షన్‌ ‌హాలు, వి•డియా హాలు, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎంలు, బస్‌ ‌కౌంటర్‌, ‌రైల్వే కౌంటర్‌, ‌క్యాంటీన్‌, అసోసియేషన్‌ ‌బిల్డింగ్‌, ‌డిస్పెన్సరీ, మసీదు, దేవాలయం, చర్చి తదితరమైనవి ఉన్నాయి. 300 సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు షిఫ్టుల్లో పనిచేసేందుకు 300 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నాము. ఈ సీసీ కెమేరాలను అనుసంధానం చేస్తూ ఐదో అంతస్తులో ఓ కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్‌ ‌వాడకాన్ని తగ్గించేందుకు పార్కింగ్‌ ‌స్థలంలో సోలార్‌ ‌ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 28 ఎకరాల స్థలంలో కేవలం రెండున్నర ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేసి, మిగిలిన స్థలాన్ని పచ్చదనం, పార్కింగ్‌, ‌రోడ్ల కోసం వినియోగించడం విశేషం అన్నారు. సచివాలయానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఇందులో తూర్పు వైపు నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు వెళ్లవచ్చు. పశ్చిమం వైపు ఏర్పాటుచేసిన ద్వారాన్ని అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించారు. ఈశాన్యంలోని ద్వారం గుండా అధికారులు, ఉద్యోగులు వెళ్తారు. వారికి పార్కింగ్‌ ‌కూడా అక్కడే ఉంది. ఆగ్నేయ ద్వారాన్ని సందర్శకులకు ప్రత్యేకించారు. వారికి ప్రత్యేకంగా పార్కింగ్‌ ‌సౌకర్యం, పాసులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 617 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్మాణ వ్యయం 20-30 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భవనం నిర్వహణకుగాను ప్రతి చదరపు అడుగుకు సుమారు రూ. 10 చొప్పున మొత్తం 10 లక్షల చదరపు అడుగులకు నెలకు రూ. కోటి వరకూ మెయింటెనెన్స్ ‌ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భవనం తెలంగాణలో అద్భుత కట్టడగా నిలుస్తుందని మంత్రి వేముల వివరించారు.

A symbol of Telangana's self-respect telangana new secreteriat
ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, ‌సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం నిర్మాణం జరిగిందని అన్నారు.

అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌
‌రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించనున్న డా. బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయం భవనంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్‌, ‌సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. టీఎస్‌ఎస్‌పి అడిషనల్‌ ‌డీజీ స్వాతి లక్రా, లా అండ్‌ ఆర్డర్‌ ‌విభాగం ఏడీజీ సంజయ్‌ ‌జైన్‌, ‌నగర పోలీస్‌ ‌కమీషనర్‌ ‌సివీ.ఆనంద్‌, అడిషనల్‌ ‌సీపీ సుధీర్‌ ‌బాబు, తఫ్శీర్‌ అహ్మద్‌ ‌తదితర అధికారులతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ, వీవీఐపీల ప్రవేశం, పార్కింగ్‌ ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను అంజనీ కుమార్‌ అధికారులతో కలసి సమీక్షించారు.

Leave a Reply