మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని మల్లన్నగుట్ట వద్ద ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ రవి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఇందులో భాగంగా మల్లన్న గుట్టవద్ద ఉపాధి హామి పనులను పరిశీలించి కూలీలకు మాస్కు లను అందజేశారు. గ్రామంలోని ఐకేపి వరిదా న్యం కొనుగోలు కేంద్రిన్ని సంధర్శించి రికార్డుల ను పరిశీలించారు. యూసుప్నగర్లోని ఫీడర్ చానల్‌ను ఉపాధిహామి పథకం ద్వారా చేస్తున్న పనులను, వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామం లోని నర్సరీని పరిశీలించి డిమాండ్ పర్వే ప్రకారం మొక్కలున్నాయా లేదా ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.
కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలంద రు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు దరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీస్కోవాలని అధికారుల ను ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ బి రాజేశం, డీఆర్డీఏ పీడి )క్ష్మి నారాయణ, తహసల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, జిల్లా మైనార్టీ అధికారి సుందర్ వరదరాజన్, డీటి వకీల్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, సర్పంచ్‌లున్నారు.