Take a fresh look at your lifestyle.

ఒకే దేశం- ఒకే రేషన్‌ ‌కార్డుకు మూడు అవరోధాలు

“2014 ఆగస్టులో ఆనాటి ప్రభుత్వం శాంతకుమార్‌ ‌కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనంలో ఆహార సంస్థ గిడ్డంగుల్లో లీకేజి 70 శాతం వరకూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వ్యవస్థ అవినీతికి ఆలవాలమైనట్టు దక్షిణాసియా ఇనిస్టిట్యూట్‌ ‌హీడెల్‌ ‌బర్గ్ ‌నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అంతేకాక, ప్రజా పంపిణీ వ్యవస్థకు సరైన నెట్‌వర్క్ ‌లేదు. ఈ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఆహార ధాన్యాలు అసలైన లబ్దిదారులకు చేరడం లేదు. లోపాలను సవరించేందుకు ఆధార్‌, ‌బయోమెట్రిక్‌ ‌విధానాలను అమలు జేస్తున్నారు. అయినప్పటికీ లీకేజి అదుపులోకి రాలేదు.”

A study by Heidelberg of the South Asian Institute concluded

నరేంద్ర మోడీ ప్రభత్వం తలపెట్టిన ఒకే దేశం- ఒకే రేషన్‌ ‌కార్డు ప్రణాళిక విజయవంతం కావాలంటే ప్రభత్వం మూడు అవరోధాలను దాటాలి. అంతర్‌ ‌రాష్ట్ర వలసదారులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ది పొందలేరు. ఆ మేరకు ఈ పథకాన్ని సరిదిద్దాల్సి ఉంటుంది. ఒకే దేశం- ఒకే రేషన్‌ ‌కార్డు పథకం జనవరి ఒకటవ తేదీ నుంచి పాక్షికంగా అమలులోకి వచ్చింది. మూడు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించనిదే ఈ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తే చిక్కులు ఎదురుకాక తప్పదు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను ముందుగా సరిదిద్దాలని ఈ పథకంపై అధ్యయనం జరిపిన పరిశోధకులు చెబుతున్నారు. ఆహార ధాన్యాలను నిల్వచేసేందుకు అవసరమైన గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవాలి, పంపిణీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి, లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవాలి. ఈ మూడూ ముందుగా చేపట్టి వీటిలో ఉన్న లోపాలను సవరించినట్టయితే, ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అడ్డంకులు ఏమీ ఉండవు. అంతర్‌ ‌రాష్ట్ర సమన్వయం కూడా అత్యవసరం. ఈ పథకాన్ని ముందుగా 2019 జూన్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫథకం హర్యానా, రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌, ‌త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ, గోవా, కర్నాటక, కేరళలలో అమలులో ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామవిలాస్‌ ‌పాశ్వాన్‌ ‌విలేఖరులతో మాట్లాడుతూ, ఈ పథకం ఇతర రాష్ట్రాల్లో ఈనెల 30వ తేదీ నుంచి అమలులోకి వొస్తుందని చెప్పారు.

ప్రజా పంపి ణీ వ్యవస్థకు అవసరమైన ఆహార ధాన్యాలను ఆహార సంస్థ గిడ్డంగుల్లో నిల్వచేస్తున్నారు. చాలకపోతే ప్రైవేటు గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 5,33,000 చౌకడిపోలు ఉన్నాయి. 2017-18లో 55.2 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం సరఫరా చేసింది. మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం అదే సంవత్సరంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 54.04 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాలను ప్రజలు తీసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు సబ్సీడీపై ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో అంతర్‌ ‌రాష్ట్ర వలసదారులు లేరు. వీరి సంఖ్య 54.26 మిలియన్లు ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్న ఏర్పాటు ప్రకారం పంపిణీ చేస్తే అంతర్‌ ‌రాష్ట్ర వలసదారులకు మేలు జరగదు. మహారాష్ట్రలో వలసదారులకు తాత్కాలిక రేషన్‌ ‌సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. జాతీయ ఆహార భద్రతా పథకం కింద అందరికీ ఆహార ధాన్యాలను అందించాలని ఒఎన్‌ఒఆర్‌సీ లక్ష్యంగా పెట్టుకుంది దీని వల్ల వలసదారులకూ, బీడీ ఆకుల పరిశ్రమల్లో పని చేయడానికి వొచ్చిన ఇతర ప్రాంతాల కార్మికులకు అందరికీ మేలు జరుగుతుంది. దినసరి వేతనం పొందే వారికి సైతం ప్రయోజనం చేకూరుతుంది. బయోమెట్రిక్‌ ‌విధానం ద్వారా ఈ కేటగిరి రేషన్‌ ‌కార్డు దారులకు ఆహార ధాన్యాలను అందించేందుకు వీలవతుంది. ఆహార భద్రతా పథకాన్ని చౌకడిపోల ద్వారా అమలు జరిపేందుకు వీలుందని ఆహార భద్రత కార్యదర్సి రవికాంత్‌ ‌తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య తగిన స్టోరేజి సదుపాయాలు లేకపోవడం. ఉన్న గిడ్డంగులలో ఆహార ధాన్యాలను ఎలుకలు తినేయడం, లీకేజి వంటి సమస్యలను ఈ వ్యవస్థ ఎదుర్కొంటోంది. 2009-10 గణాంకాల ప్రకారం 47.6 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాలకు రాష్ట్రాలు 42.4 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాలనే సేకరించాయి.

ఈ సేకరించిన నిల్వల్లో 23.5 మిలియన్‌ ‌టన్నల ఆహార ధాన్యాలు మాత్రమే వినియోగమయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో 40.4 శాతం లీకేజి ఉందని నిపుణులు నిర్ధారించారు. 2014 ఆగస్టులో ఆనాటి ప్రభుత్వం శాంతకుమార్‌ ‌కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యయనంలో ఆహార సంస్థ గిడ్డంగుల్లో లీకేజి 70 శాతం వరకూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వ్యవస్థ అవినీతికి ఆలవాలమైనట్టు దక్షిణాసియా ఇనిస్టిట్యూట్‌ ‌హీడెల్‌ ‌బర్గ్ ‌నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అంతేకాక, ప్రజా పంపిణీ వ్యవస్థకు సరైన నెట్‌వర్క్ ‌లేదు. ఈ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఆహార ధాన్యాలు అసలైన లబ్దిదారులకు చేరడం లేదు. లోపాలను సవరించేందుకు ఆధార్‌, ‌బయోమెట్రిక్‌ ‌విధానాలను అమలు జేస్తున్నారు. అయినప్పటికీ లీకేజి అదుపులోకి రాలేదు. గుజరాత్‌, ‌మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదశ్‌ ‌లలో చౌకడిపోలను ఆటోమేషన్‌ ‌పద్దతుల్లో నడుపుతున్నారు. నాగాలాండ్‌లో పది శాతం మాత్రమే చౌక డిపోల ద్వారా ఆహార ధాన్యాలను సేకరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రాష్టాలలో ఇదే పద్దతి. ఆటోమేషన్‌ ‌లేక పోవడం వల్ల ఈ వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. ఆధార్‌ ‌కార్డులతో రేషన్‌ ‌కార్డులతో అనుసంధానం చేయడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలో ఇంతవరకూ 85 శాతం రేషన్‌ ‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు జాగృతమైతే తప్ప ఈ వ్యవస్థలో లోపాలను సరిదిద్దలేమని ఈ వ్యవస్థపై అధ్యయనం చేసిన మమతా ప్రధాన్‌, ‌దేవేష్‌ ‌రాయ్‌లు స్పష్టం చేశారు.

Tags: study by Heidelberg,South Asian Institute, concluded,automation,Gujarat, Maharashtra, Telangana, Andhra Pradesh

Leave A Reply

Your email address will not be published.