గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది
విశాఖపట్టణం, డిసెంబర్ 7 : రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ రోజుమాదిరిగానే దువ్వాడలోని ఓ కళాశాలలో చదువుకునేందుకు రైలులో రాకపోకలు కొనసాగిస్తుంది.
బుధవారం గుంటూరు -రాయగఢ ఎక్స్‌ప్రెస్ దిగుతున్న ఆమె రైలుకు-ఎ•-లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రైలు కదిలితే విద్యార్థినికి ప్రమాదం జరిగే అవకాశముండడంతో ఆమెను సురక్షితంగా కాపాడేందుకు రైల్వే సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గంటపాటు శ్రమించారు. ఈ సమయంలో ఆమె తీవ్రంగా ఇబ్బందులకు గురైంది. చివరకు ఆమెను స్వల్పగాయాలతో బయటకు తీసి సపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.