Take a fresh look at your lifestyle.

ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం

ఉమ్మడి రాష్ట్రంలో హెచ్‌టి వైర్లతో 240 కుటుంబాలకు ఇబ్బందులు
ఉమ్మడి రాష్ట్రంలో పటించుకోని ప్రజా విజ్ఞాపనలు
ప్రత్యేక రాష్ట్రంలో మంత్రి జగదీష్‌ ‌రెడ్డి దృషికి తీసుకెళ్ళిన స్ధానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
తక్షణమే స్పందించిన మంత్రి జగదీష్‌ ‌రెడ్డి
మంత్రి చొరవతో డియంఎఫ్‌టి నిధుల విడుదల
హుటాహుటిన వైర్లు తొలగింపు
మంత్రి జగదీష్‌ ‌రెడ్డికి కోదాడ పట్టణ ప్రజల కృతజ్ఞతలు

కోదాడ జూలై 22 (ప్రజాతంత్ర విలేకరి): ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం లభించింది. స్వరాష్ట్రంలో సుపరిపాలన అన్నది నిరూపణ జరిగింది. అందుకు కృషి చేసిన రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డిని కోదాడ పట్టణ వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే 60 ఏండ్ల కిందట విద్యుత్‌ ‌శాఖ ఏర్పాటు చేసిన 33 కేవీ విద్యుత్‌ ‌వైర్లు కాలక్రమేణా విస్తరించిన కోదాడ పట్టణ ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే విషయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు స్ధానిక ప్రజలు అప్పటి పాలకుల దృషికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి జరిగిన ఎన్నికల్లో కోదాడ నుండి ఎన్నికైన స్ధానిక శాసనసభ్యులు బొలం మల్లయ్య యాదవ్‌ ‌దృషికి తీసుకొచ్చారు. దీనితో స్పందిచిన ఆయన సంబంధిత శాఖామంత్రి జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి దృషిలో పెట్టారు. విషయాన్ని అర్ధం చేసుకున్న మంత్రి 33 కేవీ వైర్లతో 240 కి పై కుటుంబాలు అవస్ధలు పడుతున్నారని తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసారు. వారితో నివేదిక తెప్పించుకున్న మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి జగదీష్‌ ‌రెడ్డి ఆదేశానుసారం డియంఎఫ్‌టి నిధులు విడుదల చేయడంతో రంగంలోకి దిగిన విద్యుత్‌ ‌సిబ్బంది ఆఘమేఘాల మీద విద్యుత్‌ ‌వైర్లను తొలగించారు. 60 ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న వైర్ల ప్రమాదం విషయం తెలియగానే స్పందించి తొలగించిన మంత్రి జగదీష్‌ ‌రెడ్డికి స్ధానిక శాసనసభ్యులు బొలం మల్లయ్య యాదవ్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలు మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అందించిన సహకారాన్నీ కొనియాడారు.

33 కేవీ వైర్ల మార్పునకు, నూతన ఆర్డీవో కార్యాలయ భవనానికి శంకుస్ధాపన…
పట్టణంలో ఆరు దశాబ్దాలుగా ప్రమాదకరంగా ఉన్నా 33 కేవీ వైర్ల మార్పునకు మరియు నూతన ఆర్డీవో కార్యాలయ భవనానికి స్ధానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి గురువారం శంకుస్ధాపన చేసారు. ఈ సంద్బంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను పాలకులు పట్టించుకోలేదని తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంట్టున్న సమస్యలను గురుతెరిగిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. కోటి పదహారు లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్‌ ‌లైను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. కోదాడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్ని రంగాల్లో అభివృధ్ధి పధంలో నడిపిస్తున్నారన అన్నారు. 90 లక్షల వ్యయంతో నూతనంగా ఆర్డీవో కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌వినయ్‌ ‌కృష్ణారెడ్డి, ఆర్డీవో కిషోర్‌ ‌కుమార్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌శిరీషాలక్ష్మీనారాయణ, సుధారాణి పుల్లారెడ్డి, పద్మమధు, చింతా కవితా, జ్యోతిమధు, చందు నాగేశ్వరరావు, ప్రభుత్వ అధికారులు, కౌన్సిలర్‌లు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply