Take a fresh look at your lifestyle.

మహాత్ముడికి ఘన నివాళి

బాపూఘాట్‌లో గవర్నర్‌ ‌తమిళసై, సిఎం కెసిఆర్‌ అం‌జలి
‌రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ ‌వద్ద మహత్ముడి విగ్రహానికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌, ‌సీఎం కేసీఆర్‌ ‌పూలమాల వేసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. ఎంపి కె కేశవ రావు, స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ‌మహ్మూద్‌ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌ ‌బొంతు రామ్మోమన్‌, ‌పలువురు ఉన్నతాధికారులు బాపూజీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బాపూఘాట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. సిఎం కెసిఆర్‌, ‌గవర్నర్‌ ‌రాకతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

గవర్నర్‌ ‌భర్త సౌందర రాజన్‌కు కెసిఆర్‌ ‌సన్మానం
గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌భర్త డాక్టర్‌ ‌సౌందర్‌ ‌రాజన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శాలువాతో సత్కరించారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, ‌బెస్ట్ ‌మెడికల్‌ ‌టీచర్‌ అయిన డాక్టర్‌ ‌సౌందర్‌ ‌రాజన్‌కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు సీఎం కేసీఆర్‌ అభినందించారు. కెసిఆర్‌ ‌శుక్రవారం  నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌ ఆహ్వానం పలికారు.

Leave a Reply