కేంద్ర భారతీయ భాషా సంస్థ, ఎమెస్కో జ్ఞాన యజ్ఞం
బాలలకోసం ఎమెస్కో మరో అద్భుత జ్ఞానయజ్ఞం నిర్వహించారు. సరళంగా రామాయణ గాధను ముందు తెలుగులో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి రచించి దాన్ని మనదేశంలోని సకల భాషల్లో అనువదించి అందంగా ముద్రించి పిల్లలకు అందుబాటులోకి తేవడమే ఆ యజ్ఞం.
ఎమెస్కో విజయకుమార్, డిజైనర్ తెలుగు ఫాంట్ల నిపుణుడు పురుషోత్తం కుమార్
విలువలు నిలువలు నిలువలుగా ఉన్న ప్రబోధ గ్రంధం రామా యణం. చిలువలు పలువలుగా మోసాలు నేరాలుపెరుగుతున్న ఈ సమాజానికి అవసరమైన మంచి సాహిత్యంరామాయణం. మంచి తనం, మంచి నడవడిక నేర్పే పాత్రల నడక ఈ కావ్యంలోకనిపిస్తుంది. స్థూలంగా కథ తెలిసినా వివరాలు చాలామందికి తెలియదు. ఈనాటి తల్లిదండ్రులకు ఎంతవరకు రామాయణం తెలుసో మనం చెప్పలేము. అబద్దాలు మోసాలు వద్దని భారత రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్ చెప్పదు. ఆ పనులు చేస్తే శిక్షిస్తానంటుంది. కాని అబద్దాల వల్ల ఎవరికీ అబద్దనేరానికి శిక్ష పడడం లేదు. నిబద్ధత, నిజాయితీ, ధర్మం, న్యాయం అంటే ఏమిటో రామాయణం చెబుతుంది.
సుందరకాండ ఆరంభం, మచిలీపట్నం శాస్త్రిగారి కళారూపం, హనుమ చూసిన స్వర్ణ లంక