అమ్మ ఒడిలో నిద్రించే బాల్యం
బడిలో బంధీగా మిగులుతుంది
నాన్న వేలుపట్టి నడిచే ప్రాయం
కాన్వెంట్ కభేలాకు తరలుతుంది
ఆట,పాటతో అలరారే శైశవం
పుస్తకాలతో కుస్తీ పడుతుంది
చిట్టి మాటల పల్లవించే స్వరం
అర్థమవని పాఠాలు వల్లిస్తుంది
స్వేచ్ఛగా విహరించే పసితనం
బ్యాగు భారంతో కుంగుతుంది
మార్కుల సాధనా పరుగులు
ఊపిరి సలపని ఒత్తిళ్ల మధ్య
పొగిలి పొగిలి దుఃఖపోస్తుంది
ఇంతకీ ఈ పసి ప్రాయాలను
బలి పశువుల చేస్తుందేవరు?
ఇంకెవరు తమ పిల్లల
భవిత పునాదిగా తలచి
ఆశల సౌధాలను నిర్మించ
తలపెడ్తున్న తల్లిదండ్రులు
కాసుల కోసం నోళ్లు తెరిచే
కార్పొరేట్ రాకాసి బల్లులు
ఇకనైనా సమాజం మేల్కొని
విష బీజాలను పెరికెయ్యాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు
జీవన విలువలు నేర్పించాలి
గురువులు పాఠంతో పాటు
వ్యక్తిత్వ వికాసం బోధించాలి
ప్రభుత్వాలు పాలక వర్గాలు
బాలల హక్కులు కాపాడాలి
అపుడే బాల్యం సదా సంక్షేమం
భావి తరం సర్వత్రా బలోపేతం
– కోడిగూటి తిరుపతి, 9573929493