Take a fresh look at your lifestyle.

8‌న కేంద్ర బడ్జెట్‌పై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రసంగం

A Question on Session on State of the Indian Economyఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020 21పై మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం మంగళవారం ప్రసంగించనున్నారు.ఈనెల 8న హైదరాబాద్‌ ‌బంజరాహిల్స్ ‌రోడ్‌ ‌నం.3 లోని ముఫకంజా కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌, ‌టెక్నాలజీ కళాశాలలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఏఐసిసి పరిశోధన సంస్థ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎ క్వొశ్చన్‌ ఆన్సర్‌ ‌సెషన్‌ ఆన్‌ ‌స్టేట్‌ ఆప్‌ ‌ద ఇండియన్‌ ఎకానమీ అనే అంశంపై చిదంబరం ప్రసంగిస్తారు. టీ పీసీసీ చీఫ్‌, ‌కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి గౌరవ అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషన్‌ ‌సొసైటీ చైర్మన్‌ ‌ఖాన్‌ ‌లతీప్‌ ‌మహ్మద్‌ ‌ఖాన్‌ అధ్యక్షత వహిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply