Take a fresh look at your lifestyle.

బందీ క్షేమం ..!

  • మృతి చెందిన పోలీసు కుటుంబాలకు సంతాపం
  • మావోయిస్టుల ప్రకటన విడుదల

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది . లేఖలో 2 వేలమంది పోలీసులు మాపై దాడికి వచ్చారు .. అమిత్ షా నాయకత్వంలోనే భారీ దాడులకు పథకం జరిగిందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో దాడికి పథకం వేసారని ..పోలీసుల దాడికి మేం ప్రతిదాడి చేశాం .. ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోయారు ..ఒక పోలీసు మాకు బందీగా దొరికారు ..

మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసుని అప్పగిస్తాం .. పేర్లు ప్రకటించే వరకు పోలీసు మా వద్ద క్షేమంగా ఉంటారు .. పోలీసుల దాడిలో మా సభ్యులు నలుగురు మృతి..పోలీసులు మాకు శత్రువులు కాదు .. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం .. చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదు ‘ అని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply