Take a fresh look at your lifestyle.

మహిళల ఆర్థిక సామాజికాభివృద్దికి పెద్దపీట

  • కుటుంబానికి చుక్కానిలా ఉంటున్నది మహిళలలే
  • వారి సేవలకు కొలమానాలు లేవు
  • గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు
  • క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్‌

మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌.. ‌మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు. గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ ‌చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్‌ఆర్‌ ‌సంపూర్ణ పోషణ నామినేటెడ్‌ ‌పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చామని వివరించారు.

రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలోరూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్‌ ‌చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ ‌చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్‌ ‌లీవ్స్ 20 ‌రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని‘ సీఎం జగన్‌ అన్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు.మహిళ అంటే ఆకాశంలో సగ భాగం, సృష్టిలో సగ భాగం అంటారు.. అలాంటి మహిళలు, అక్క చెల్లెమ్మలకు సగభాగం ఇస్తున్నామా అనేది మనమంతా ఆలోచన చేయాలని సీఎం జగన్‌ అన్నారు..

మహిళలకు రాజకీయంగా, ఆర్ధికంగా హక్కుల్లో సగ భాగం ఇస్తున్నామా అనేది గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలన్న ఆయన.. ప్రతి పనిలోనూ మహిళలే కనిపిస్తుంటారు.. దేశం గర్వించేలా డ్వాక్రా ఉద్యమంలో మహిళలు క్రియాశీలకంగా ఉంటారు.. ఇంటిని అన్ని విధాలా బాగుపరచాలనే తాపత్రయం అక్క చెల్లెమ్మల్లో కనిపిస్తుందన్నారు. ప్రతి ఇంటిలోనూ మహిళలు మనల్ని ఉన్నతంగా ఉంచబట్టే ఈ స్థాయిలో ఉన్నామన్న ఆయన.. భూదేవంత సహనంతో ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తోన్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొలమానాలులేవన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.. మహిళా మంత్రుల సమక్షంలో కేక్‌ ‌కట్‌ ‌చేసిన సీఎం జగన్‌. ‌మహిళా హెల్ప్ ‌డెస్క్ ‌లను ప్రారంభించారు.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ ‌డెస్కలు పనిచేయనున్నాయి.. ఇక, దిశ కియోస్క్ ‌యంత్రాలను కూడా ప్రారంభించారు సీఎం.. ప్రత్యేకంగా రూపొందించిన 900 దిశ బైక్‌ ‌లు అందుబాటులోకి వచ్చాయి..

పని చేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు చట్టం ఉంది.. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేధింపుల నిరోధానికి విచారణకు కమిటీ తప్పని సరిగా ఉండాలని చట్టం చెబుతోం దన్నారు.. సచివాలయంలోనే మహిళల వేధింపుల నివారణ కమిటీ లేదు.. తొలుత సచివాలయం నుంచే ఈ కమిటీ వేస్తామన్నారు.. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయంలో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ ‌జగన్‌. ‌మహిళలను ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సీఎం వైఎస్‌ ‌జగన్‌.. ‌రేపటి తరం చిన్నారులకు సింహ భాగం పథకాలు ఇచ్చామన్న ఆయన.. తొలిసారిగా ఈ ఏడాది బ్జడెట్‌ ‌లో జెండర్‌ ‌బడ్జెట్‌ ‌కాన్సెప్ట్ ‌తీసుకువస్తున్నాం.. అక్కచెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉందని చెబుతూ జెండర్‌ ‌బడ్జెట్‌ ‌తీసుకువస్తున్నామని తెలిపారు.. అక్క చెలెమ్మలకు బ్జడెట్‌ ‌లో ఎంత ఖర్చు చేస్తున్నామనే వివరాలను వచ్చే బ్జడెట్‌ ‌లో ప్రవేశపెడుతున్నాం..

మహిళల కోసం ప్రభుత్వం ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం ఖర్చుచేస్తున్నామనే వివరాలతో బ్జడెట్‌ ‌ను ప్రవేశపెడతాం అన్నారు. రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే ఉంది.. ఇప్పటికీ 40 శాతం మహిళలు చదువులకు దూరంగా ఉన్నారని.. అన్ని అంశాల్లోనూ స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే సమాజం ఎటు పోతుందో ఆలోచన చేయాలన్నారు. అక్క చెలెమ్మల కోసం అనేక పథకాలు చేపట్టాం.. చదువు రాని వారు ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామని వెల్లడించిన సీఎం.. ఆడపిల్లలు ఇంగ్లీష్‌ ‌మీ డియం చదువులు గొప్పగా చదవాలని పథకాలు చేపట్టినట్టు తెలిపారు. 44.50 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 85 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి తీసుకువచ్చాం.. ఏడాదికి రూ. 6500 కోట్లు చొప్పున రెండేళ్లుగా రూ. 13022 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. 5 ఏళ్లలో రూ. 32500 కోట్లు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టనున్నామని వెల్లడించారు. చట్టం చేసిన ప్రభుత్వం మనదేనని గర్వంగా చెబుతున్నా…

వారికి ఎవరైనా అన్యాయం చేస్తే బుద్ది చెప్పేందుకు 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం.. ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేసాం, కోర్టులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ‌తెలిపారు.. మహిళలపై నేరాలను 7.5 శాతం తగ్గించగలిగాం.. నేరాల దర్యాప్తుకు 100 నుంచి 53 రోజులకు తగ్గించామని ఈ సందర్భంగా వెల్లడించారు. మహిళలకు ఇంటివద్దకే వచ్చి అన్ని రకాల తోడుంటే సేవలను తీసుకువచ్చాం.. ఈ ఏడాది మహిళా దినోత్సవం కోసం మరిన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై మహిళా ఉద్యోగులకు 15 సీఎల్‌ ‌లను 20 రోజులకు పెంచుతూ ప్రకటన చేశాం.. చెల్లెమ్మలకోసం బయో డీ గ్రేడబుల్‌ ‌శానిటరీ న్యాప్‌ ‌కిన్స్ ‌ను తీసుకువస్తున్నాం.. 7-12 తరగతి చదువుతున్న చెలెమ్మలకు జూలై 1 నుంచి ఉచితంగా న్యాప్‌ ‌కిన్స్ ఇస్తాం..

చేయూత కిరణా దుకాణాల్లో తక్కువ ధరకే న్యాప్‌ ‌కిన్స్ అం‌దిస్తామని తెలియజేశారు. ఆర్ధిక నేరాలు, మోసాలు, ప్రైవసీకి భంగం కల్గించే సాప్ట్ ‌వేర్లు, మాల్వేరు, వైరస్‌ ‌లను గుర్తించి అప్రమత్తం చేస్తామన్నారు సీఎం.. ఇప్పటికే 50 కియాస్క్ ‌లు కొనుగోలు చేసి దిశ పోలీసు స్టేషన్లుసహా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉంచుతున్నాం.. ప్రతి పథకం, కార్యక్రమం లోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నామన్నారు.

Leave a Reply