Take a fresh look at your lifestyle.

జ్ఞాపకాలు చెరిగిపోకుండా చూసేదే ఫోటో

మన మధుర మైన తీపి జ్ఞాపకాలను పది లపరిచే చాయా చిత్రం, మన జీవితాల్లో విడదీయ రాని బంధ మైన ఛాయా చిత్రం,
మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయా చిత్రం, మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం. కరిగేకాలము లో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి ,జీవితకాలం వాటిని పదిలంగా దాచుకుని, అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చేతీపిగుర్తులు. ఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం, ఓ పదం చదివితే ఇంకొన్నాళ్ళకు మరుగున పడుతుంది , కాని ఓఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకు పోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతిదాగుంటుంది. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది.

ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది.రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాలకలయికే ఫొటోగ్రఫీ. ఫోటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం, ఇంతటితీయని గుర్తుల ముద్రలు వేసే ఈ ఫొటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా గా ఓ ముఖ్యమైన రోజు ఉంది. ఇందుకోసం ఆగస్టు 19 తేదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు . ఫొటోగ్రఫీ ప్రక్రియ లోనిఓ దశ  డాగ్యుర్రియో టైప్‌&#39ను కనుగొనడం ఈ ఫొటోగ్రఫీ దినానికి మూలం. ఈప్రక్రియను ఫ్రెంచ్‌ ‌దేశస్థులైన లూయిస్‌ ‌డాగ్యుర్రె మరియు జోసెఫ్‌ ‌నిస్ఫోర్‌1837 ‌లో కనుగొన్నారు.అభివృద్ధి పరిచాడు . ఆ తరువాత 1839 సంవత్సరంలో ఆగస్టు 19 నడాగ్యుర్రియో టైప్‌ ‌యొక్క పేటెంట్‌ ‌హక్కులను అప్పటి ఫ్రెంచ్‌ ‌ప్రభుత్వంకొని ప్రపంచానికి ఉచితంగా యావత్‌ ‌ప్రపంచానికి ఒక బహుమానంగా ఆ ఆవిష్కరణనుఇవ్వడం జరిగింది. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపు, తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులుఅద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.క్షణాల్లో ఫోటొలు చేతుల్లోకి వచ్చేసే నేటి ఆధునిక ఫోటోగ్రాఫ్‌ ‌పరిజ్ఞానం వెనక ఎందరెందరో అధ్యయనాలు, పరిశోధనలుఉన్నాయి. అంచెలంచెలుగా ఒక్కో దశ సాగి 100 ఏళ్ళ కాలం లో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం హంగులు సమకూరాయి. నాటి నుంచి నేటి దాకా ఎందరి శాస్త్రవేత్తల కృషి ఉందో గుర్తుదేసుకోవడం కోసమే ఈ ప్రపంచ ఫోటోగ్రఫీఉత్సవం.అయితే ఫోటోలు తీయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు, అది ఓ కళ . ఇందుకు ఎంతో కష్టం, శ్రమ, ప్రతిభ, ముందుచూపు ఆవశ్యకం. ఫోటోకు భాష అవసరం ఉండదు, ఎందుకంటే నిరక్ష్యరాస్యులు సైతం ఫోటోను చూసి సన్నివేశం, సంఘటనను ఇట్టే అర్థం చేసుకోగలరు.

ధర్నాలు, ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, ఉగ్రవాద దాడులు, ప్రకృతి బీభత్సాలు ఇలాఏది జరిగినా, అక్కడ ముందుండేది ఫోటో జర్నలిస్టులే. మెరుపుతో కూడా పోటీపడి ఛాయాచిత్రాలు తీసే సత్తా కేవలం ఫోటోజర్నలిస్టులకే ఉందని చెప్పవచ్చు.పత్రికల్లో వార్తలను చదివించే శక్తి ఫోటోకు మాత్రమే ఉండగా, వేయి మాటలతో, వందలాది పదాలతో చెప్పలేని భావాన్నిఒక్క ఫోటో వ్యక్తీకరిస్తుందంటే ఫోటో గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. కావున, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయాసంఘటన లను కవర్‌ ‌చేసే ఫోటోగ్రాఫర్లను ఈ రోజు గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా।। ఎండి  ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్,  9492791387

Leave a Reply