Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా ఆగని కొరోనా విజృంభణ

  • 24 గంటల్లో 9985 మందికి వైరస్‌
  • ఒక్కరోజులో 279 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడి
  • జూలై నాటికి పదిలక్షలకు చేరుకుంటుందన్న అంచనాలు

దేశవ్యాప్తంగా కూడా కరోనా విజృంభించనుంది. జులై నెలాఖరు నాటికి 8 నుంచి 10 లక్షలకు పెరగొచ్చు అని శివనాడార్‌ ‌విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ‌సమిత్‌ ‌భట్టాచార్య తెలిపారు. లాక్డౌన్‌ ‌సడలింపుల తరువాత కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్న అంచనాల మేరకు ఆయన తెలిపారు. తాజా అంచనాల ప్రకారం జులై చివరి నాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని అంటున్నారు. జులై చివరి కల్లా ఒక్క ఢిల్లీలోనే 5.5 లక్షల కేసులు వెలుగు చూస్తాయని అంచనా వేశారు. రాజధాని ఢిల్లీలో సుదీర్ఘ లాక్డౌన్‌ ‌విధించినా కరోనా వ్యాప్తి పెరిగింది. అందులోనూ చాలా కేసుల్లో వారికి ఎలా వైరస్‌ ‌సోకింది అనేది అర్థం కాకుండా ఉంది అని కోల్‌కతాకు చెందిన సీఎస్‌ఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్త ఉపాసన రే పేర్కొన్నారు. దేశంలో గత 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ ‌సంక్రమించి నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 279 మంది కూడా మరణించినట్లు పేర్కొన్నది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ ‌కేసుల సంఖ్య 276583గా ఉంది. దీంట్లో 133632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 135206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్‌19 ‌వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 7745గా ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక వైరస్‌ ‌శ్యాంపిల్‌ ‌పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ ‌తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 142216 మందికి వైరస్‌ ‌పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ ‌పేర్కొన్నది. భారత్‌లో రికవరీ కేసుల సంఖ్య పెరుగుతున్నది. యాక్టివ్‌గా ఉన్న కేసుల కన్నా.. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 48.9 శాతంగా ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది.

  • తీవ్రత ఉన్నా డిశ్చార్జ్ అవుతున్న వారూ ఎక్కువే
  • ఊరట కలిగించేలా కోలుకుంటున్న వారి సంఖ్య

భారత్‌లో కరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతున్న కరోనా రికవరీ రేటు కూడా అదే విధంగా ఉంటోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇదిలా ఉండగా దేశంలో కొవిడ్‌ ‌నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెగుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలిసారిగా బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైనే బాధితులు కోలుకున్నారు.

మొత్తం బాధితుల్లో 1,35,206 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఇంకా 1,33,632 మంది వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు మృతుల సంఖ్య 7,745కు చేరినట్లు తెలిపింది. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, ‌రష్యా, యూకేలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మరణాల రేటులో భారత్‌ 12‌వ స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశంలో అన్ని రాష్టాల్లోక్రంటే మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 వేలకు పైనే కేసులు బయటపడ్డాయి. ఇక మృతులు సంఖ్య 3289గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరంలోనే ఇప్పటి వరకు 51వేల కేసులు బయటపడటం అక్కడ తీవ్రతకు అద్దంపడుతోంది.కరోనా తీవ్రత ఉన్నా డిశ్చార్జ్ అవుతున్న వారూ ఎక్కువే ఊరట కలిగించేలా కోలుకుంటున్న వారి సంఖ్య న్యూఢిల్లీ,జూన్‌10(ఆర్‌ఎన్‌ఎ):‌భారత్‌లో కరోనా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతున్న కరోనా రికవరీ రేటు కూడా అదే విధంగా ఉంటోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇదిలా ఉండగా దేశంలో కొవిడ్‌ ‌నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెగుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలిసారిగా బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది.

ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైనే బాధితులు కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 1,35,206 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. ఇంకా 1,33,632 మంది వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు మృతుల సంఖ్య 7,745కు చేరినట్లు తెలిపింది. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, ‌రష్యా, యూకేలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మరణాల రేటులో భారత్‌ 12‌వ స్థానంలో కొనసాగుతోంది.ఇక దేశంలో అన్ని రాష్టాల్లోక్రంటే మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 వేలకు పైనే కేసులు బయటపడ్డాయి. ఇక మృతులు సంఖ్య 3289గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరంలోనే ఇప్పటి వరకు 51వేల కేసులు బయటపడటం అక్కడ తీవ్రతకు అద్దంపడుతోంది.

Leave a Reply