Take a fresh look at your lifestyle.

మహోన్నత శిఖరం…!

ఆమె…!
రక్తపు ముద్దను రూపంగా మార్చి
నవమాసాలు గర్భగుడిలో మోసి
పురిటి నొప్పుల తో మృత్యువు నేదిరించి
తన ప్రతి రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మాతృత్వం…!

ఆమె…!
ప్రేమాను రాగాలను కలబోసి
రేయింబవళ్ళు రక్షక కవచమై
కంటికి రెప్పలా కాపాడిన
కనిపెంచిన కనిపించిన
దేవత…!

ఆమె …!
అన్నం కలిపి  గోరు ముద్దలు పెడుతూ
ప్రేమామృతం  తో దాహం తీరుస్తూ
తన బిడ్డ కడుపు నిండగానే
ఆనందంతో తన కడుపు నిండినంత  సంతసించే అమృత వర్షిణి…!

ఆమె…!
అంతులేని ఆకాశమంత మనసున్న మమతల హారం
ఏనాటికి తరగని భాగ్యల భాండాగారం
పదాలు తెలియని పెదాలకు అమృత వర్షం
ఆయువు పంచిన ప్రాణ దాత…!

ఆమె…!
బాధ్యతల కోసం భారం మోసే శిరం
కుటుంబం కోసం ఆరాట పడే పోరాటం
తన వారి కోసం ఆత్మీయతను పంచే బంగారం
ఆమె…అమ్మ మనందరి మహోన్నత శిఖరం…!
ఆమెకు నా వందనం….!

– కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)
జలగం నగర్‌, ‌ఖమ్మం రూరల్‌
‌ఖమ్మం జిల్లా, 7032504646

Leave a Reply