ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి
గాయాలతో బయటపడ్డ పైలట్
జైపూర్,మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్ లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 యుద్ధ విమానం హనుమాన్‌గఢ్‌లోని డబ్లీ ప్రాంతంలో జనావాసాలపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
జనావాసాలపై విమానం పడిపోవడంతో ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి గాయపడ్డా తరవాత మృతి చెందాడు. గాయపడ్డ పైలెట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం ఒక ఇంటిపై పడింది. దీని కారణంగా ఇద్దరు మహిళలు మరణించారు. అదే సమయంలో పైలట్ పారాచూట్ సాయంతో విమానం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గత జనవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో రెండు ఎంఈ ఫైటర్ జెట్‌లు సుఖోయ్ -30, మిరాజ్-2000 శిక్షణ సమయంలో కూలిపోయాయి. ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. శిక్షణ సమయంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది. అదే సమయంలో, గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. శిక్షణ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో ఏప్రిల్‌లో కొచ్చిలో మరో ప్రమాదం జరిగింది. గతేడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 5, 2022న, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి సపంలో చీతా హెలికాప్టర్ కూలిపోయి, భారత ఆర్మీ పైలట్ మరణించాడు. కొన్ని రోజుల తరువాత, అక్టోబర్ 21 న, భారత సైన్యానికి చెందిన ఏవియేషన్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు రక్షణ సిబ్బంది మరణించారు. ఇది టూటింగ్‌కు 25 కిలోటర్ల దూరంలోని సియాంగ్ గ్రామ సపంలో కూలిపోయింది.