Take a fresh look at your lifestyle.

లోతట్టు ప్రాంతాల ముంపుకు పటిష్ఠ కార్యాచరణ

రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా వెంటనే పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నగర మేయర్‌ ‌గుండా ప్రకాష్‌ ‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ ‌పమేలా సత్పతితో కలసి బల్దియా పరిధిలో వర్షపు నీటి వల్ల ముంపుకు గురయ్యే ప్రాంత్రాల్లో ముందస్తుగా తీసుకోవలసిన చర్యలు, ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌పై సంబందిత అధికారులతో సమావేశమై సమర్ధంగా చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా యుద్దప్రతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిడబ్ల్యూఎంసి పరిధిలో 20 శాతం ప్రజలు స్లమ్‌ ‌ప్రాంతాల్లో నివసిస్తున్నారని,ఆయా ప్రాంతాల్లో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గత సంవత్సరం ముంపునకు గురైన ప్రాంతాలలో ప్రజలు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, 58 డివిజన్లలో ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి చేపట్టవలసిన కల్వర్ట్, ‌డ్రైన్‌ ‌పొడిగింపు తదితర పనుల ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.కొన్ని ప్రాంతాలలో మెల్లగా నీటి ప్రవాహం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా మోటర్ల ద్వారా నిల్వ నీటిని తొలగించాలని తెలిపారు. నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల డి ఈ లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కఛ్చా డ్రైన్స్, ‌నాలాలు, మురుగు కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని, తీసిన చెత్త, మట్టిని వెంటనే తరలించాలని, ఆవసమైతే అధికంగా మెన్‌ ‌మెటీరియల్‌, ‌మెషినరీ వినియోగించాలని చెప్పారు. షాపింగ్‌ ‌కాంప్లెక్‌ ‌ముందు కాలువలపై స్లాబ్‌ ‌లు వేయడం, మెట్లు కట్టడం వల్ల కాలువలు శుభ్రం చేయుటకు విలుపడకున్నందున వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌కార్యక్రమంలో పేరుకుపోయిన చెత్త ప్రాంతాలను గుర్తించి డంప్లన్నీ క్లియర్‌ ‌చేయాలని, ఇంటెన్సివ్‌ అం‌టి లార్వా స్ప్రేయింగ్‌ ‌చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలు రోడ్లపై పడ వేయకుండా గుర్తించి తొలగించాలని అన్నారు. ఆదివారం 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమాంలో అందరిని భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున చేయాలన్నారు. మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా నిబద్దతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. వచ్చే నెల 1 నుండి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌కార్యక్రమంలో నాలాలు, పెద్ద మురుగు కాలువలలో గట్టి చెత్త, డేబ్రెస్‌ ఉం‌డడం వల్ల నీటి ప్రవాహం వేగం తగ్గుతుందని, బార్‌ ‌గ్రిల్‌ ‌లను ఏర్పాటు చేసి నీటి ప్రవాహం పెంచాలని అన్నారు. 58 డివిజన్లలో పారిశుధ్యం చేయడంతో పాటు బ్లీచింగ్‌ ‌పౌడర్‌, ‌సోడియం హైపోక్లోరైడ్‌ ‌ద్రావనాన్ని పిచికారి చేయాలన్నారు. సమావేశానికి గైరుహజరైన 7గురు సానిటరీ ఇన్స్పెక్టర్లకు తాఖీదులు జరిచేయాలని ఆదేశించారు.వేకెంట్‌ ‌ల్యాండ్‌ ‌టాక్స్, ‌కమర్షియల్‌ ‌నల్లాల పన్నులు పక్కాగా వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ ‌భాస్కర్‌ ‌రెడ్డి, ఆర్‌ఎఫ్‌ఓ, ఎం‌హెచ్‌ఓ ‌రాజి రెడ్డి, ఇంజనీరింగ్‌ ఈఈ ‌లు, డిఈలు, ఏఈ లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!