వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రజల నాడి పట్టుకున్న నాయకుడు

February 13, 2020

“కేజ్రీవాల్‌ ‌సామాన్యులతోపాటు అందరి కష్టాలనూ, సమస్యలనూ  ఏనాడూ విడిచి పెట్టకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. అందుకే అన్ని వర్గాల వారూ ఆయనకు  ఓటు వేశారు.  ప్రభుత్వ పాఠశాలల్లో  కార్పొరేట్‌ ‌స్థాయి విద్యావిధానాన్ని అమలు జరిపించారు.మొహల్లా దవాఖానాలను ఏర్పాటు చేశారు.  ప్రజల మౌలిక సదుపాయాలైన విద్యుత్‌, ‌నీరు సరఫరా విషయంలో శ్రద్ధ చూపారు. మోడీ, షాలు అనుసరిస్తున్న జాతీయవాద, హిందుత్వవాదాల పై విమర్శలు గుప్పించకుండానే, తాను చేసిన అభివృద్ధిని గురించి ప్రజల్లో బలంగ ప్రచారం చేసినందుకే  కేజ్రీవాల్‌   ‌మోడీ,షా ల వ్యూహాన్ని చిత్తు చేయగలిగారు.”

A leader who catches people's Pulse

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల హిందుత్వ, జాతీయవాదాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ‌సారథి అరవింద్‌ అగర్వాల్‌ ఎలా ఎదుర్కొని ఓడించగలిగారు? జాతీయ వాదం, హిందుత్వం, సంక్షేమం ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు బాగా పని చేస్తాయి. అటువంటి తరుణంలో ఆప్‌ ‌వంటి చిన్న పార్టీ కేంద్రంలో,పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. చరిత్ర ఏం చెబుతోందంటే జాతీయవాదం. మెజారిటీ వర్గీయుల మతవాదం తిరుగులేనివి. వాటిని ఓడించడం కష్టం. అలాగే, సోషలిజం కూడా.దశాబ్దాలుగా ఎన్నికల్లో ఇవే బాగా పని చేస్తున్నాయి.2014లో మోడీ రంగ ప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి మారింది., సుప్రసిద్ధ జర్నలిస్టు అరుణ్‌శౌరీ ఓ మాట అనేవారు బీజేపీని కాంగ్రెస్‌ ‌ప్లస్‌ ‌గోవు అని. అంటే ఆవు విషయంలో తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు. అలాగే, కోల్‌కతాలో మా మిత్రుడు ఒకరు తాజా బడ్జెట్‌ ‌పై వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీలో కొత్తదనం లేదు. ప్రకాష్‌ ‌కరత్‌ ‌ప్లస్‌ ‌సీఏఏ అని. కరత్‌ ‌కన్నా సీఏఏ మోడీలో అదనంగా ఉందని. దేశంలో బీజేపీ 92 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది. అంతా గుడులు,గోపురాల వల్లే బీజేపీ ఇన్ని ఓట్లు సాధిస్తోందనుకుని రాహుల్‌గాంధీ గుడులు,గోపురాల సందర్శనను ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు.బాలాకోట్‌ ‌దాడులకు ఆధారాలు ఏవని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తుంది.370 అధికరణం రద్దును, ముమ్మారు తలాఖ్‌ ‌రద్దును తప్పు పడుతుంది.భారతదేశంలో పాతకాలపు పార్టీలు దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవడం లేదు.మమతాబెనర్జీ కాంగ్రెస్‌ ‌నుంచి సామాజిక,ప్రజాకర్షక విధానాలను లాగేసు కున్నారు.రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా చోర్‌ అం‌టూ నిందిస్తారు.సంస్కృతి,భరతమాత, రాముడు, రామచరితమానస్‌ ‌మొదలైనవి ఏ పార్టీ సొత్తు కాదు.

కేజ్రీవాల్‌ ‌చూడండి ఆయన దేవుణ్ణి నమ్ముతారు.అదే సందర్భంలో ప్రజల సంక్షేమాన్ని ఏనాడూ విస్మరించరు.దేశభక్తి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతటితో సరిపెట్టకుండా అమరజవాన్ల కుటుంబాలను ఆదుకుం టారు.కేజ్రీవాల్‌ ‌విజయోత్సవ ర్యాలీల్లో ప్రసంగిస్తూ మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజునే తనకు మళ్ళీ విజయం లభించిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆంజనేయుని దయవల్లే మళ్ళీ తాను అధికారంలోకి రాగల గానన్న భావం వచ్చేట్టు వ్యాఖ్యానించారు. హనుమాన్‌ ‌చాలీసాను బహిరంగంగా అందరితో పాటు చదివారు. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ , జామియా మిలియా వర్సీటీల్లో గొడవల పైనా, షహీన్‌ ‌బాగ్‌ ‌సంఘటనపైనా స్పందించలేదని కేజ్రీవాల్‌ ‌పార్టీపై విమర్శలు వచ్చాయి. అయినా ఆయనేం మాట్లాడలేదు. దేశభక్తి, రాముడి మీద భక్తి ఉన్నా వాటిని గురించి ప్రచారం చేయకుండా తనకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలను అమలు జేశారు. అమరులైన సైనికుల కుటుంబాలకు ఎక్స్ ‌గ్రేషియా అందించారు.కాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దును సమర్థించారు.బాలాకోట్‌లో మెరుపుదాడులను సమర్థించారు.కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వంటగ్యాస్‌ ‌కనెక్షన్ల పథకాన్ని స్వాగతించారు ముస్లిం స్త్రీలను ఆకట్టుకునేందుకు ముమ్మారు తలాక్‌ ‌రద్దును సమర్థించారు.మతాలు,కులాల వారీగా కాకుండా ప్రజలకు ఏవి ఉపయోగపడతాయో వాటిని సమర్థించారు. ఏ ఇజమూ లేకుండా హ్యూమనిజం లక్ష్యంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యుల సమస్యల పై దృష్టిని కేంద్రీకరించారు. దైవభక్తి దైవభక్తే , సంక్షేమం సంక్షేమమే నని చాటి చెప్పారు. మెరుపుదాడులు, 370వ అధికరణం రద్దు మొదలైన నిర్ణయాలు తీసుకున్నందుకు మోడీని విమర్శించలేదు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మోడీ-షా వ్యూహాన్ని తిప్పి కొట్టే రీతిలో ఇటు హిందువులనూ, అటు ముస్లింలు, ఇతరులను ఆకర్షించేందుకు ఆయన అనేక కార్యక్రమాలను అమలు జేశారు.విజయం వార్త వినగానే జై శ్రీరామ్‌ అని నినదించారు.బీజేపీ వారి కంటే తాను ఎక్కువ రామభక్తుడినని నిరూపించుకునే ప్రయత్నించారు.కేజ్రీవాల్‌ ‌సామాన్యులతోపాటు అందరి కష్టాలనూ, సమస్యలనూ ఏనాడూ విడిచి పెట్టకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. అందుకే అన్ని వర్గాల వారూ ఆయనకు ఓటు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ ‌స్థాయి విద్యావిధానాన్ని అమలు జరిపించారు.మొహల్లా దవాఖానాలను ఏర్పాటు చేశారు. ప్రజల మౌలిక సదుపాయాలైన విద్యుత్‌, ‌నీరు సరఫరా విషయంలో శ్రద్ధ చూపారు. మోడీ, షాలు అనుసరిస్తున్న జాతీయవాద, హిందుత్వవాదాల పై విమర్శలు గుప్పించకుండానే, తాను చేసిన అభివృద్ధిని గురించి ప్రజల్లో బలంగ ప్రచారం చేసినందుకే కేజ్రీవాల్‌ ‌మోడీ,షా ల వ్యూహాన్ని చిత్తు చేయగలిగారు. మతం, జాతీయవాదం విషయంలో ఎవరికీ పేచీ లేదు. ప్రజలకు కావల్సింది కనీస మౌలిక సదుపాయాలు. వాటిని కల్పించడం ద్వారానే కేజ్రీవాల్‌ ‌పైచేయి సాధించగలిగారు 2024లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం కావచ్చు.ప్రజల నాడి పట్టుకోవడం అంటే అదే. ప్రజల నాడిని పట్టుకున్న నాయకునిగా కేజ్రీవాల్‌ ‌చరిత్రలో నిలిచిపోతారు.
-శేఖర్‌ ‌గుప్తా
‘దిప్రింట్‌’ ‌సౌజన్యంతో