Take a fresh look at your lifestyle.

రాష్ట్ర పాడిరంగంలో కీలక మలుపు

  • అమూలు సంస్థతో ఎపి సర్కార్‌ ఒప్పందం
  • హిళలకు పెద్ద చేయూత కానుందన్న సిఎం

అమరావతి,జూలై 21 : రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. పాడి అభివృద్దికి సంబంధించి అమూల్‌తో  ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ ‌చెన్నై జోనల్‌హెడ్‌ ‌రాజన్‌ ‌సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు. వైఎస్సార్‌ ‌చేయూత, ఆసరా కింద మహిళలకు రూ.11వేల కోట్లు సాయం చేశాం. ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్టాల్రకు గేట్‌వేగా ఆంధప్రదేశ్‌ ‌నిలుస్తుందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌పేర్కొన్నారు.

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయో గపడుతుందని,అలాగే.. వారి సాధికారతకూ తోడ్పాటునందిస్తు ందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. ఇది రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందంవల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి,నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.  రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.  వైఎస్సార్‌ ‌చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. వీరు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడి పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి. ఆ పరిశ్రమల్లో మహిళలకున్న అవకాశాలను పరిశీలించి వారిని ముందుకు నడిపించాలన్నారు.అలాగే డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుందన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ‌కోఆపరేటివ్‌ ‌ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎం‌డీ వాణీమోహన్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply