Take a fresh look at your lifestyle.

బళ్ళ ప్రారంభంపై రాజకీయమా!…

“విద్యా సంవత్సరం మొదలు కోసం చేయాల్సిన అసలు పనులు చేయకుండా, ప్రభుత్వం  అభిప్రాయ సేకరణ పేరిట కాలయాపన సర్కార్‌ అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుంది. అభిప్రాయ సేకరణ మదింపులో మెజారిటీ తల్లిదండ్రులు బడులు తెరవాలన్నా, వద్దన్నా వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి ఎలా తీసుకుంటారు. ఒక వేళ బడి ప్రారంభమై వైరస్‌ ‌వ్యాప్తి పెరిగి బళ్ళు ప్రమాదంలో మునుగుతే తల్లిదండ్రులనే  బాధ్యులను చేయటం తప్ప మరోటి కాదు. అభిప్రాయ సేకరణలు ప్రజలను పక్కదారి పట్టించే రాజకీయ చిట్కాలే కానీ మరోటి కాదు. ఇప్పటికైనా బడులకు నిధులు కేటాయించి ‘‘హైజినిక్‌ ఏం‌టీ కొరోనా పాఠశాల’’లుగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాలిక అమలు చేయండి.తల్లి దండ్రులకు నమ్మకం కలిగించండి.విలువైన విద్యాసంవత్సరాన్ని కాపాడుకుంటూనే విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి..!”

రాష్ట్రంలో బడుల ప్రారంభం విషయంలో కేంద్రానికి తన అభిప్రాయం చెప్పే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తనదైన ‘‘రాజకీయ ఆట’’ను మొదలుచేసింది. బడులు ఎప్పుడు తీద్దామనే కేంద్ర ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ ‌పాఠశాల తల్లిదండ్రుల అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో తక్షణమే గూగుల్‌ ‌షీట్స్ ‌ద్వారా సేకరించాలని జిల్లా విద్యాధికారులను ఉత్తర్వులను అందజేసింది. ఈమేరకు జిల్లా విద్యాధికారులు పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రిపోర్టులనుఅందజేయాలని సోమవారం రాత్రి హెడ్‌ ‌మాస్టర్లకు సమాచారమిచ్చారు. తెలంగాణ సర్కార్‌ ‌కోవిడ్‌-19 ‌వైరస్‌ ‌ను ఎదుర్కొనే క్రమంలో వ్యూహాత్మకంగా విఫలమై రాష్ట్రాన్ని కరోనా పాజిటివ్‌ ‌ల హబ్‌ ‌గా మార్చింది.ఈ విషయమై ఇం తకాలంగా తమ సహనాన్ని వీడి హైకోర్టు సోమవారం. రాష్ట్ర సర్కార్‌ ‌కరోనా వార్‌ ‌పై వైఫల్యాలపై సీరియస్‌ ‌గా ఫైర్‌ అయింది. మార్చి లాక్‌ ‌డౌన్‌ ‌నుండి రాష్ట్ర సర్కార్‌ ‌వైఫల్యాలను పేరుపేరునా నిలదీసింది . ప్రభుత్వం విద్యాశాఖలో అమలుకు తీసుకునే విధాన నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో పని చేసే ఉపాధ్యాయులు, సంఘాలను,తల్లిదండ్రులను ఏనాడు సంప్రదించిన దాఖలా లేదు. మార్చి అకస్మాత్తు లాక్‌ ‌డౌన్‌ ‌విధింపు నుండి ఏ సమీక్షా సమావేశంలోనూ నేటి వరకు లేని జనాభిప్రాయం తీసుకోలేదు. ఐ.ఏ.ఎస్‌.‌స్థాయి అధికారులతో ప్రగతి భవన్‌లో ప్రవక్త చెప్పే వ్యక్తి గత అభిప్రాయమే అధికార సమీక్షగా వెలువడుతుంది.ఇదే తెలంగాణ రాష్ట్ర సమీక్ష సమావేషాల రివాజని అందరికి తెలిసిందే!. కేంద్రానికి తెలియజేయాల్సిన బడి ప్రారంభం కోసం తీసుకునే నిర్ణయం విషయంలో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ వెనుక సర్కార్‌ ‘‘‌భస్మాసుర నాటకం’’ లేకపోలేదని అభిప్రాయం వెల్లడవుతుంది.

సామాజిక వ్యాప్తి పెరిగి జూలై,ఆగస్ట్ ‌నెలలలో కొరోనా విశ్వరూపం చూపుతుందనే శాస్త్రవేత్తల అంఛనా నిజమైతున్నది. తెలంగాణలో ఏప్రిల్‌,‌మే,జూన్‌ ‌నెలలో టెస్టింగ్‌ల సంఖ్య నామమాత్రం చేసిన ఫలితంగా పాజిటివ్‌ ‌ల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపింది. ఇప్పుడు జులై రెండవ వారంలో రాపిడ్‌ ‌టెస్ట్ ‌లు పెంచిన నేపథ్యంలో పెరుగుతున్న రోజువారి అధికార బులెటిన్‌ ‌లో పాజిటివ్‌ ‌ల సంఖ్యలతో సహా అన్ని వివరాలు గందరగోళంగా వుంటున్నాయి. టెస్ట్ ‌చేసినా కూడా వైరస్‌ ‌లక్షణాలు కనిపించనప్పటికినీ ప్రతి పది మందిలో సగం మందికి వైరస్‌ ‌వుందని తెలుస్తున్నది. ఇదే సామాజిక వ్యాప్తికి కారణమై రోజువారి పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య వేలు దాటుతున్నది.బడి ప్రారంభం విషయంలో జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా కూడా సామాజికవ్యాప్తి దశలో విజృంభిస్తున్న కొరోనా భయం తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్ళుగా పాఠశాల విద్యకు కేటాయించాల్సిన నిధులను సగం కన్న తక్కువ చేసింది. చివరకు నిర్వహణా గ్రాంటులు కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇస్తున్నది. ఈ నిధుల కోతల ఫలితంగా కునారిల్లిపోయిన బడుల సౌకర్యాలు తల్లిదండ్రులకు ఆందోళన కల్గిస్తున్నది.ఇప్పుడు బడుల్లో ఏమేరకు కొరోనా ఎదుర్కునే సంరక్షక చర్యలను చేపట్టారో ప్రకటన లేదు. ఆరోగ్యకర బడి ఏర్పాటు పై క్షేత్ర స్థాయి లో పని చేసే ఉపాధ్యాయులు చేసిన సూచనలపై కనీస స్పందన లేదు. ఆరోగ్య కార్యకర్తల ఏర్పాటు,శానిటైజేషన్‌,‌విద్యార్థులకు ఉపాధ్యాయ సిబ్బందికి మాస్కులు పంపిణీ,ఆక్సో మీటర్‌ ఏర్పాటు పై స్పందన లేదు. పాఠశాల లో తాత్కాలిక పద్దతిన నియమించిన స్కావెంజర్‌ ‌సిబ్బంది వుండగా పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను గ్రామ పంచాయితీవే అని ప్రకటన వెలువడ్డది. అంటే ఈ తాత్కాలిక స్కావెంజర్‌ ‌సిబ్బందిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలకు అవకాశం వుంది .అదే నిజమైతె బడుల్లో పరిశుభ్రతత సంగతి గంగ పాలయినట్టే!

బడుల ప్రారంభం పై తల్లి దండ్రుల నుంచి హెడ్‌ ‌మాస్టర్లను ఈ కింది వివరాలు సేకరించమని కోరింది. పాఠశాల ప్రారంభం అంటూ ఆగస్ట్,‌సెప్టెంబర్‌,అక్టోబర్‌ ‌నెలల్లో ఏ నెలలో చేద్దామని అడిగింది. పాఠశాలలో ఎలాంటి రక్షణ సౌకర్యాలు వుండాలని కోరుతున్నారంటూ లిస్టు ఇచ్చింది. మాస్కులు,శానిటైజేషన్‌,‌వ్యక్తిగత డెస్క్ ‌లు.భౌతిక దూరం పాటింపు ,మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం పెంపు ఇవన్నీ ఆ లిస్టులో పేర్కొన్నారు.ఇవన్నీ ఉండటంతో పాటు ఆరోగ్య శాఖ సమన్వయం,విద్యార్థులకోసం ప్రత్యేక కోవిడ్‌ ‌వార్డులు,ప్రత్యేకంగా ఆక్సీజన్‌ ‌గల అంబులెన్స్ ‌లు,పాఠశాలలు తిరిగే మొబైల్‌ ‌కోవిడ్‌ ‌పరీక్షల టీంల ఏర్పాటు. తక్షణ సమాచార సేకరణకు మండల జిల్లా స్థాయిల్లో సమాచార కేంద్రాలు,విద్యాధికారి కార్యాలయంలో సమాచార సమన్వయక కేంద్రం. ప్రత్యేకంగా జిల్లా శాఖలో సమాంతర ఆరోగ్య కార్యకర్తల టీంల ఏర్పాటు ఇందుకు నిధుల విడుదల సంసిద్దత,వీలైతే హెడ్‌ ‌మాస్టర్లకు ఆన్‌ ‌లైన్‌ ‌లో శిక్షణ ఇవ్వా
ల్సిన అవసరం వుంది.

సర్కార్‌ ‌దవాఖానాలలో కరువైన సౌకర్యాలపై మీడియా ఒళ్ళు గగుర్పొడిచే ప్రత్యక్ష కథనాలు కళ్ళకు కడుతుంటే,రోజువారి బులెటిన్లలో సమాచారం భయభ్రాంతులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసే ఉపాధ్యాయులు,హెడ్‌ ‌మాస్టర్ల పై తల్లిదండ్రులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళేఉపాధ్యాయులు,హెడ్‌ ‌మాస్టర్లు కొరోనా భారిన పడకుంటే అదే పదివేలు అనుకునే దుస్థితి వున్నది.. ఈ టక్కుటమార గారడీకి అటు కేంద్ర సర్కార్‌ ఉత్తర్వుల కోసం,తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలు అవసరం రాలేదు. విద్యా సంవత్సరం మొదలు కోసంచేయాల్సిన అసలు పనులు చేయకుండా, ప్రభుత్వం అభిప్రాయ సేకరణ పేరిట కాలయాపన సర్కార్‌ అవగాహన రాహిత్యాన్ని సూచిస్తుంది. అభిప్రాయ సేకరణ మదింపులో మెజారిటీ తల్లిదండ్రులు బడులు తెరవాలన్నా,వద్దన్నా వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి ఎలా తీసుకుంటారు. ఒక వేళ బడి ప్రారంభమై వైరస్‌ ‌వ్యాప్తి పెరిగి బళ్ళు ప్రమాదంలో మునుగుతే తల్లిదండ్రులనే బాధ్యులను చేయటం తప్ప మరోటి కాదు. అభిప్రాయ సేకరణలు ప్రజలను పక్కదారి పట్టించే రాజకీయ చిట్కాలే కానీ మరోటి కాదు. ఇప్పటికైనా బడులకు నిధులు కేటాయించి ‘‘హైజినిక్‌ ఏం‌టీ కరోనా పాఠశాల’’లుగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాలిక అమలు చేయండి.తల్లిదండ్రులకు నమ్మకం కలిగించండి.విలువైన విద్యాసంవత్సరాన్ని కాపాడుకుంటూనే విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply