Take a fresh look at your lifestyle.

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

బీఎల్‌ ‌సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులపై స్టే 22 వరకు పొడిగింపు
హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత బీఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గుస్వామికి సిట్‌ ‌నోటిసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా హైకోర్టు స్టేను పొడిగించింది. ఇటీవల దాఖలైన పిటీషన్లను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపి డిసెంబర్‌ 22 ‌వరకు సిట్‌ ‌నోటీసులపై స్టే విధించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ ‌సంతోష్‌ ‌నిందితులతో మాట్లాడినట్టు సిట్‌ ‌వాదిస్తుంది.

అందుకే సంతోష్‌ ‌ను విచారిస్తే కీలక విషయాలు బయటకు రానున్నాయి. దీనితో సంతోష్‌ ‌కు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత నెల 26న లేదా 28న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై బిఎల్‌ ‌సంతోష్‌ ‌హైకోర్టును అశ్రయించగా ఇప్పటికే రేండు సార్లు సిట్‌ ‌నోటీసులపై స్టే ఇచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే జరగడంతో ముచ్చటగా మూడోసారి స్టే పొడిగించింది కోర్టు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఇక హైకోర్టు ఆదేశాలతో సిట్‌ అధికారులు ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరి ప్రస్తుత నోటీసులపై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కొత్త నోటీసులు ఇవ్వాలని చూస్తుంది కానీ ఇప్పటికే ఇచ్చిన నోటిసులపై కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ నోటీసులు ఇవ్వలేరని సీనియర్‌ ‌న్యాయవాది చెబుతున్నారు. కానీ ఈ నోటీసులపై స్టే ఉంది కాబట్టి దీనిపై ముందుకెళ్లడానికి మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్‌ ‌చూస్తుంది. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Leave a Reply