Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు కీలక నిర్ణయం

  • ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిసిన ఎస్‌ఐపీబీ
  • వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

అమరావతి,అక్టోబర్‌ 28 : ‌చిత్తూరు జిల్లాలో పేరూరు, విశాఖపట్నంలో భీమిలి మండలం అన్నవరం, కపడజిల్లాలో గండికోట, చిత్తూరులో హార్సిలీ హిల్స్, ‌తూర్పుగోదావరిజిల్లా పిచ్చుక లంకలో.. మొత్తంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమి అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు.  స్టార్‌ ‌సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు నిర్మిస్తారు.   ఐదు రిసార్ట్‌లను ఓబెరాయ్‌ ‌విలాస్‌ ‌పేరుతో ఏర్పాటు నిర్మించనున్న ఓబెరాయ్‌ ‌కంపెనీ అని తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ.1350 కోట్ల రూపాయలు  ఓబెరాయ్‌ ‌ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో 10,900 మందికి ఉద్యోగాల కల్పన వస్తుందన్నారు. భీమిలిలో రూ.350 కోట్లతో ఏర్పాటు చేయనున్న మరో టూరిజం ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  7 స్టార్‌ ‌సదుపాయాలు 5500 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. తిరుపతిలో రూ.250 కోట్ల టూరిజం ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం. 1500 మందికి ఉద్యోగాలు రానున్నట్లు ప్రకటించారు.

చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఇస్కాన్‌ ‌ఛారిటీస్‌ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విశాఖలో తాజ్‌ ‌వరుణ్‌బీజ్‌ ‌వద్ద టూరిజం  ప్రాజెక్టుకు, విజయవాడలో హోటల్‌ ‌హయత్‌ ‌ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. టూరిజం పాలసీలో భాగంగా వారికి పలు రాయితీలు వర్తింపు చేస్తారు. ఎపీ గూడ్స్ ‌మరియు సర్వీస్‌ ‌టాక్స్ ఆర్డినెన్స్ ‌సవరణలకు కేబినెట్‌ ఆమోదం లభించింది.

ప్రకాశం జిల్లా వాడరేవులో ఫిషింగ్‌ ‌హార్బర్‌ ‌నిర్మాణానికి పరిపాలనా అనుమతులకు కేబినెట్‌ ఆమోదం
విశాఖపట్నంలో మధురవాడలో అదానీ ఎంటర్‌ ‌ప్రైజస్‌ ఆధ్వర్యంలో 200 మెగావాట్ల డాటా సెంటర్‌ ‌పార్క్, ‌బిజినెస్‌ ‌పార్క్, ‌స్కిల్‌ ‌యూనివర్శిటీలకు 130 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం. రూ. 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రూపు. ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ ‌ట్యాంకులకు జీఎన్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌స్‌కు లిప్ట్ ఇరిగేషన్‌కు కేబినెట్‌ ఆమోదం లభించింది. మొత్తం 5 లిఫ్టులను 227.1 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. మూడు కొత్త ఆక్వాకల్చర్‌ ‌ప్రాజెక్టుల కోసం 73 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రెగ్యులర్‌ ‌పోస్టులు డిప్యూటేషన్‌ ‌పద్ధతిలో భర్తీకి, 67 అవుట్‌సోర్సింగ్‌ ‌విధానంలో భర్తీకి కేబినెట్‌ ఆమోదం
ఇచ్చింది. విజయనగరంలో జేఎన్టీయూ కాలేజీని యూనివర్శిటీగా మారుస్తూ గతలో కేబినెట్‌ ‌నిర్ణయం దీనికి జేఎన్డీయూ గురజాడ యూనివర్శిటీగా నామకరణానికి కేబినెట్‌ ఆమోదం లభించింది. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌జారీచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply