Take a fresh look at your lifestyle.

పేదల ఆకలి తీర్చటం బృహత్తర కార్యక్రమం

మండలంలో కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌నేపద్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదోళ్ల ను గుర్తించి వారికి మేము ఉన్నాం అంటూ సిపిఐ(ఎం) పార్టీ ఆద్వర్యంలో బియ్యం, నిత్యవసరాలు అంద• •యండ బహృత్తర కార్యక్రమం అని ఎంపిడిఓ మళ్లీశ్వరి, ఎస్సై రతీశ్‌ అన్నారు. శనివారం సిపిఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో సున్నంబట్టి గ్రామానికి చెందిన 90 మంది నిరుపేద కుటుంబాలకు నాలుగు క్వింటాళ 50 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు, కూరగాయలను ఎంపిడిఓ, ఎస్సై చేతుల మీదుగా అందజేశారు.

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు సుమారుగా 50 క్వింటాళ బియ్యంతో పాటు కూరగాయలు, నిత్యవసరాల ను దాతల సహా యంతో అంద జేయడం జరిగిం దన్నారు. ఇంకా చాలా చోట్ల పేదలు అప న్నహస్తం కోసం ఎదురు చూస్తు న్నారని దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరడంతో పాటు అందించిన దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటి సభ్యుడు యలమంచి వంశీకృష్ణ, రైతు సంఘం మండల అద్యక్షులు వై. శ్రీనుబాబు, నాయ కులు దల్లి సతీష్‌, ‌యానబోయిన వెంకటనర్సయ్య, గణేష్‌రెడ్డి , ప్రభాకర్‌, ‌కాక క్రిష్ణ, నాగరాజు, శ్రీను, రమేష్‌, ‌వెంకన్న ఉన్నారు.

Leave a Reply