Take a fresh look at your lifestyle.

మానవీయతకు నిలువెత్తు రూపం ‘మదర్‌ ‌థెరీసా’

26 ఆగష్టు మదర్‌ ‌థెరీసా 110వ జయంతి సందర్భంగా..

1943లో కలకత్తా పేదల దుస్థితి మరియు ఎదుర్కొన్న కరువు కారణంగా నిరుపేదల వ్యథలను చూసి చలించి పోయారు. పేదలు, రోగుల దుస్థితిని ప్రత్యక్షంగా చూచిన థెరీసాలోని మానవీయత ఉబికి తన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, 07 అక్టోబర్‌ 1950‌లో వాటికన్‌ ‌మతగురువు అనుమతితో ‘మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీ’ని రూపొందించారు. తన నిస్వార్థ సేవలను గుర్తించిన జోసెఫ్‌ ‌లాంగ్‌ఫొర్డ్ ఆనందం వ్యక్తం చేస్తూ ‘మదర్‌ ‌థెరీసా’ అని సంభోదించడం ప్రారంభించారు. భారతీయ పౌరసత్వం పొందిన థెరీసా నీలి అంచుగల తెల్ల చీరను ధరించటం అలవాటు చేసుకున్నారు.

26 ఆగస్టు 1910న స్కోప్జె పట్టణం, అల్బేని యాలో నికోలె మరి యు డ్రానఫైల్‌ ‌బొజా క్షిహ్యు దంపతులకు జన్మి ంచిన మదర్‌ ‌థెరీసా అసలు పేరు ‘ఆగ్నెస్‌ ‌గోంక్శే బొజాక్షిహ్యు’. ఆమె రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌చర్చి ద్వారా ‘సేయింట్‌ ‌థెరిసా ఆఫ్‌ ‌కలకత్తా’ గౌరవాన్ని పొందారు. 27 ఆగష్టున క్రైస్తవ మతాన్ని(బాప్టిజం) స్వీకరించిన థెరీసా తన అసలు పుట్టిన రోజుగా ప్రకటించుకున్నారు. తన 18వ ఏటనే ఇంటిని వదిలి ‘సిస్టర్స్ ఆఫ్‌ ‌లొరెంటో’ ప్రచార సంఘంలో చేరి, స్వల్పకాలం ఐర్లాండ్‌లో తరువాత 1929లో ఇండియాకు చేరి తన జీవన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1950లో ‘మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీ’ని స్థాపించి నాయకత్వం వహిస్తూన్న మదర్‌ ‌థెరీసా 133 దేశాలలో 4,500 సన్యాసినుల(నన్స్)‌తో పేదలకు, రోగగ్రస్థులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్న వారికి పరిచర్యలు చేస్తూ 45 సంవత్సరాలు సేవా కార్యక్రమాలను కొనసాగించారు. హెచ్‌ఐవి/ఏయిడ్స్, ‌కుష్టు, క్షయ వ్యాధిగ్రస్థులకు ఆశ్రమాలు నెలకొల్పి వారికి మరియు వారి కుటుంబాల పిల్లలకు మరియు అనాథలకు వైద్య, భోజన మరియు విద్యను ఉచితంగా అందించే సేవలు చేశారు. తన జీవితాన్ని అభాగ్యుల సంక్షేమానికి అంకితం చేసిన మదర్‌ ‌సేవను గుర్తించమన అంతర్జాతీయ సమాజం 1979లో ‘నోబెల్‌ ‌శాంతి బహుమతి’, 1962లో ‘రామన్‌ ‌మెగసెసె శాంతి బహుమతి’ పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారత ప్రభుత్వ ‘పద్మశ్రీ’, ‘జవహర్‌లాల్‌ ‌నెహ్రూ అంతర్జాతీయ అవగాహన పురస్కారం’, 1980లో ‘భారతరత్న’ లాంటి అనేక అత్యున్నత పురస్కారాలు థెరిసాను వరించాయి. చిరుప్రాయం 12వ ఏటనే సేవారంగం పట్ల ఆకర్షితురాలైన థెరిసా తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.

1929లో ఇండియాకు చేరి డార్జిలింగ్‌లో బెంగాలీ భాష నేర్చుకొని సెయింట్‌ ‌థెరీసా పాఠశాలలో ఉపాద్యాయురాలుగా పనిచేశారు. 24 మే 1931 రోజున ప్రముఖ ‘మిషనరీస్‌ ‌సన్యాసిని థెరిసా’ జీవితానికి ఆకర్షితురాలై తన పేరును థెరీసాగా మార్చుకొని సన్యాసినిగా మారారు. 14 మే 1937 నుండి తూర్పు కలకత్తాలోని లొరెంటో కాన్వెంట్‌ ‌పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా 20 సంవత్సరాలు సేవలు అందించారు. 1943లో కలకత్తా పేదల దుస్థితి మరియు ఎదుర్కొన్న కరువు కారణంగా నిరుపేదల వ్యథలను చూసి చలించి పోయారు. పేదలు, రోగుల దుస్థితిని ప్రత్యక్షంగా చూచిన థెరీసాలోని మానవీయత ఉబికి తన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, 07 అక్టోబర్‌ 1950‌లో వాటికన్‌ ‌మతగురువు అనుమతితో ‘మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీ’ని రూపొందించారు. తన నిస్వార్థ సేవలను గుర్తించిన జోసెఫ్‌ ‌లాంగ్‌ఫొర్డ్ ఆనందం వ్యక్తం చేస్తూ ‘మదర్‌ ‌థెరీసా’ అని సంభోదించడం ప్రారంభించారు. భారతీయ పౌరసత్వం పొందిన థెరీసా నీలి అంచుగల తెల్ల చీరను ధరించటం అలవాటు చేసుకున్నారు. వైద్య శిక్షణ పొందిన తరువాత మరి కొంత మంది యువతుల సహాయంతో నిరుపేద పిల్లలకు పాఠశాలలు మరియు అనాథాశ్రమాలు నిర్వహించడమే తన మార్గమని ప్రతిన బూనారు. 1952లో కలకత్తాలో శిథిల స్థితిలో ఉన్న హిందూ ఆలయాన్ని ‘నిర్మల హృదయ్‌’ ‌పేరుతో వృద్ధాశ్రమంగా మార్చారు. నిరుపేదలకు ఉచిత ఆసుపత్రులు నెలకొల్పి వైద్యసేవలన విస్తరించారు.

‘శాంతి నగర్‌’ ‌పేరుతో కుష్టు రోగులకు ఆసుపత్రి స్థాపించి వైద్య మరియు భోజన వసతులు కల్పించారు. 1955లో ‘నిర్మల్‌ ‌శిశు భవన్‌’ ‌ప్రారంభించి నిరుపేద మరియు అనాథల పిల్లలకు విద్య మరియు వైద్య సదుపాయాలు అందించారు. థెరీసా సేవలను గుర్తించిన పౌరసమాజ విరాళాలతో దేశవ్యాప్తంగా పేద పిల్లలకు అనాథాశ్రమాలు మరియు పాఠశాలలు స్థాపించారు. మతమార్పిడులు ప్రోత్సహించడం మరియు పేదరికం పట్ల మత విశ్వాసాలు కలిగిన కారణంగా హిందూ సంఘాల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. 1965 నుండి అమెరికా, ఇటలీ, వెనెజ్యులా, టాంజానియా, ఆస్ట్రియా లాంటి అనేక దేశాలలో తన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘అల్బేనియన్‌ ‌రక్తం, భారత పౌరసత్వం, క్యాథలిక్‌ ‌సన్యాసత్వం కలిగి క్రీస్తుకు తన హృదయాన్ని సమర్పిస్తున్నానని’ వెల్లడించారు మదర్‌ ‌థెరీసా. 05 సెప్టెంబర్‌ 1997 ‌రోజున హృద్రోగ సమస్యతో కన్ను మూసిన థెరీసా ప్రపంచ అత్యుత్తమ సేవామూర్తిగా కొనియాడబడ్డారు. ఆ రోజుకి మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీ నేతృత్వంలో 4000 మంది నన్స్, 300 ‌బ్రదర్స్ ‌సేవలతో 123 దేశాలలో 610 అనాథాశ్రమ కేంద్రాలు పని చేసేలా సేవాసామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆమె మరణానంతరం పోప్‌ ‌జాన్‌ ‌పాల్‌-×× ‌చేత ‘బ్లెస్డ్ ‌థెరీసా ఆఫ్‌ ‌కలకత్తా’అత్యున్నత బిరుదును పొందారు. బెంగాలి, హిందీ, ఇంగ్లీష్‌, అల్పేనియా మరియు సెర్బియా భాషలు మాట్లాడగల మదర్‌ ‌థెరీసా జీవితంలో క్షణక్షణం, శరీరంలోని కణకణం అభాగ్య నిరుపేదలకు అంకితం చేస్తూ అసమాన మానవీయ సేవలు విశ్వ మానవాళికి అందించారు. మదర్‌ ‌చూపిన బాటను అనుసరిస్తూ, మానవ కళ్యాణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సేవానిరతిని ప్రదర్శిద్దాం.

burrah madhava reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ -99497 00037

Leave a Reply