Take a fresh look at your lifestyle.

పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న మానవుడు

“ప్రస్తుత ప్రపంచంలో పరిశుభ్రమైన గాలి దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం బాహ్య పరిసరాలలో ప్లాస్టిక్‌ ‌సంబందిత  వ్యర్థ పదార్థాలను కాల్చి వేయడం వలన పొగ, విష వాయువులు, గాలిలోకి విడుదల కాబడి  గాలి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. మనదేశంలో లో ఢిల్లీ పట్టణం కాలుష్యం లో మొదటి స్థానంలో ఉంది. రోడ్ల పైన దుమ్ము ధూళి 22 నుంచి 52 శాతం గాలి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి.బొగ్గు మరియు సున్నపురాయి గనుల నుండి సున్నం బూడిద గాలిలోకి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలిసి పోవడాన్ని కాలుష్యం అంటున్నాము  ఈ కాలుష్యానికి కారణం మానవులే.”

పర్యా వరణం అంటే ఈ భూమిపైన ఉండే జీవులు వాటి చుట్టూ ఉండే భౌతిక రసాయనిక పదార్థాల మధ్య ఉండే సంబంధం. ప్రతి సంవ త్సరం జూన్‌ 5‌వ తేదీన ప్రపంచ పర్యా వరణ దినోత్సవాన్ని జరుప •కుం టున్నాము. పర్యా వరణం పై ఒక అవ గాహన పెంపొం దించు కొని పర్యావరణ అను కూల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, కార్యాచరణ రూపొందించి పాటిస్తామని చెప్పే రోజు. ఈ రోజున  విద్యార్తులకు క్విజ్‌, ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు, చిత్రలేఖన పోటీలు,  పోస్టర్‌ ‌పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థి స్తాయి నుండే  పర్యావరణం పై అవగాహన కల్పిస్తారు.ఐక్యరాజ్యసమితి 1972 లో  ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్‌ 5‌న  జరపాలని నిర్ణయించి, 1974 లో మొదటి సారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ప్రతి  పర్యావరణ దినోత్సవం ఒక థీం నేపథ్యం(అంశం) చుట్టూ నిర్వహించబడుతోంది. ఈ 2020 సంవత్సరం జూన్‌ 5 ‌న  (బయోడైవర్సిటి) ‘జీవ వైవిధ్యం ’’ అనే అంశంతో జర్మనీ భాగస్వామ్యంతో కొలంబియా లో జరుపుకుంటున్నాము. గత సంవత్సరం జూన్‌ 5 ‌న  (బీట్‌ ఎయిర్‌ ‌పొల్యూషన్‌) ‘‌గాలి కాలుష్యాన్ని నివారిద్దాం’’ అనే అంశంతో చైనా దేశంలో జరుపుకున్నాము.

పర్యావరణాన్ని అర్థం చేసుకోవాలంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, ఇంధనాలు, నేల, మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశుల, మధ్య ఉండే సంబంధాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రకృతిలో మనకు సహజంగా లభించేది ఆక్సిజన్‌ ‌ప్రాణవాయువు. మానవులు అభివృద్ధి పేరుతో చెట్లు నరికి వేయడం వలన ఆక్సిజన్‌ ‌శాతం తగ్గి కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ ‌శాతం పెరిగి భూగోళం వేడెక్కుతోంది. ఇప్పుడు మంచినీళ్ళ బాటిల్‌ ‌కొనుక్కున్నట్టు గానే రాబోయే రోజులలో ఆక్సిజన్‌ ‌కూడా కొనుక్కునే పరిస్థితి రావచ్చు. ప్రకృతిలో చెట్ల యొక్క సమతుల్యత దెబ్బతినడం వలన కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మనం విఫలమౌతున్నాము. భూమి మీద మనతోపాటు ఎన్నో జంతువులు,పక్షులు, జీవరాసులు, మొక్కలు, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకొకటి బతకలేదు.

మానవుడు కూడా ఈ జీవ ప్రపంచం లో ఒక భాగం అనే విషయాన్ని మర్చిపోయి స్వార్ధంగా ఆలోచించి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు.గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, ఇంధన వినియోగం, ప్లాస్టిక్‌ ‌ను అధికంగా వాడటం, అలాగే ఎలక్ట్రానిక్స్ ‌వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ అధికం కావడానికి కారణం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవుడు ఎన్నుకున్న జీవన విధానాలు ప్రకృతిని నాశనం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ప్రపంచ దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎన్నో సదస్సులు ఆచరణాత్మక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మనదేశంలో ప్రస్తుతం భూభాగంలో 21 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన పక్షుల, జంతువుల, సంఖ్య తగ్గుతుంది. వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. భూమి ఉపరితలం వేడెక్కుతున్నది  వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత దెబ్బతింటున్నది.

చెట్లను అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా నరికి వేస్తున్నాం. జంతువులను వేటాడుతున్నాం. పక్షులను చంపుతున్నాం. నదులను కలుషితం చేస్తున్నాం. సముద్రాలను ప్లాస్టిక్‌ ‌వ్యర్థ పదార్థాలతో చెత్తబుట్టలా గా మారుస్తున్నాం  సముద్ర తీరాన్ని అలల నుండి కాపాడి రక్షించే మడ చెట్లను ఆలోచన లేకుండా కొట్టి వేస్తున్నాం. జంతువుల ఆవాసాలైన కొండల్ని, గుట్టల్ని, పిండి చేసేస్తున్నాం. సహజ వనరులను మన అవసరాలకే కాకుండా అత్యాశలకు కూడా వాడుకుంటున్నాం. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే భూమి మీద జీవజాలం మనుగడ అంతరించి పోతుంది. ప్రకృతిలో మానవుని స్థానం క్రియాత్మకమైనది. ప్రకృతిని అర్థం చేసుకొని రక్షించే  విధంగా పనులు చేయాలి. వేగంగా తరిగిపోతున్న సహజ వనరులను కాపాడాలి. వనరుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. గాలి నీరు నేల సమతుల్యతను కాపాడాలి. వనరులు కరిగిపోకుండా మన భవిష్యత్తు తరాలకు అందించడానికి మన ప్రవర్తనను పద్ధతులను మార్చుకొని పర్యావరణ సైనికులుగా సేవ చేయాలి. పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం రూపొందించుకొని పాటించాలి. కాలుష్యాన్ని నియంత్రించాలని మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలి అటవీ సంపదను కాపాడాలి నీరు విద్యుత్తును ఇతర సహజ సిద్ధ వనరులను బాధ్యతగా పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి ఇతరులకు ప్రకృతి సంరక్షణ గురించి అవగాహన కల్పించాలి పర్యావరణ చట్టాలు విధానాలు పటిష్టంగా అమలు చేయగలిగితే మన చుట్టూ ఉన్న గాలిని నీరును నేలను అంత బాగా కాపాడ గలుగుతాం ప్రస్తుత ప్రపంచంలో పరిశుభ్రమైన గాలి దొరకడం లేదు. దీనికి ప్రధాన కారణం బాహ్య పరిసరాలలో ప్లాస్టిక్‌ ‌సంబందిత  వ్యర్థ పదార్థాలను కాల్చి వేయడం వలన పొగ, విష వాయువులు, గాలిలోకి విడుదల కాబడి  గాలి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. మనదేశంలో లో ఢిల్లీ పట్టణం కాలుష్యం లో మొదటి స్థానంలో ఉంది. రోడ్ల పైన దుమ్ము ధూళి 22 నుంచి 52 శాతం గాలి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి.బొగ్గు మరియు సున్నపురాయి గనుల నుండి సున్నం బూడిద గాలిలోకి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలిసి పోవడాన్ని కాలుష్యం అంటున్నాము  ఈ కాలుష్యానికి కారణం మానవులే. వాహనాల నుండి విడుదలయ్యే పొగ గాలి కాలుష్యానికి ముఖ్య కారణం చాలామంది గాలి కాలుష్యం వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఆస్తమా రోగాలతో బాధపడుతూ రోగాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మనం పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఎన్నో చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. మన రాజ్యాంగం అధికరణం 48 (ఏ)లో పర్యావరణ రక్షణకు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని దేశంలోని వనాలను వన్య ప్రాణులను కాపాడటం రాజ్య విధి అని ఆదేశిక సూత్రాలలో చెప్పబడింది. అంతేకాదు పర్యావరణం రక్షించడం పౌరుల ప్రాథమిక విధి అని 51- ఏ(జి ) లో  స్పష్టంగా ఉంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. లేదంటే మానవుని మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974లో. వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981లో అమలులోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాలుష్య నియంత్రణకు అధికారాలు కట్టబెట్టింది .పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, కాలుష్య సమస్యల పరిష్కారాలపై  చర్చల్ని ఏర్పాటు చేయడం, కాలుష్య సమస్యలపై ఫిర్యాదులు చేయడం, కోర్టులో రిట్లు వేయడం, ప్రజా ప్రయోజనాల వాజ్యాలు దాఖలు చేయడం ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ విధానాల లక్ష్యాలే వీటిని పటిష్టంగా అమలు చేయాలి.

గాలిలో ముఖ్యంగా నైట్రోజన్‌,  ఆక్సిజన్‌, ఆర్గాన్‌, ‌కార్బన్‌ ‌డై ఆక్సై,డ్‌ ఇతర వాయువులు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటి పరిమాణం పెరిగినప్పుడు కాలుష్యం సంభవిస్తుంది. గాలిలోకి ప్రమాదకర కలుషితాలు చేరడం వలన ప్రకృతిలో నివసించే జీవులకు ప్రమాదకరంగా మారితే దానిని కాలుష్యం గా చెప్పవచ్చు. అడవుల నరికి వేత, తరిగిపోతున్న గుట్టలు , విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, విపరీతంగా పెరిగిన శిలాజ ఇంధన వాడకం, వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి శిలాజ ఇంధన వాడకం ద్వారా వెలువడుతున్న బొగ్గుపులుసు వాయువు వలన  భూతాపం పెరుగుతోంది.కార్బన్‌ ‌డయాక్సైడ్‌  ‌విడుదల అవుతున్న కొద్ది  ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతోంది  తప్ప తగ్గదు. అందువల్ల కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. 415 పి.పి.ఎం ల కార్బన్‌ ‌డయాక్సైడ్‌  ‌వాయువును, 350 పి.పి.ఎం ల  స్థాయికి తగ్గించనంత కాలం భూతాపం విలయం తప్పదు. అధిక ఉష్ణోగ్రత ప్రజల జీవితాలపై, జీవ వైవిధ్యం ప్రభావం చూపుతోంది, దేశంలోని చాలా నగరాలు 2040 నాటికి వేసవిలో బయటకు అడుగుపెట్టలేని స్థితికి చేరతాయని ఒక అంచనా
వాహనాల నుండి విడుదల అయ్యే పొగ, వాడి పడేసిన టైర్లు, మొదలైన ప్లాస్టిక్‌ ‌పదార్థాలను కాల్చడం ద్వారా వచ్చే పొగ, కర్మాగారాల నుండి  విడుదలయ్యే రసాయనాలు,  కంప్యూటర్లు, మొబైల్‌ ‌ఫోన్‌ ‌భాగాలు, మానవులు ఇంధనాలు మండించడం వలన వాహనాల రవాణా వలన ,పరిశ్రమల నుండి, విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాల నుండి, ఎరువులు పురుగుల మందుల నుండి, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు, అడవుల నరికివేత, ఇసుక తుఫానులు, సునామీల ప్రకృతి వైపరీత్యాల వలన గాలిలోకి కార్బన్‌ ‌మోనాక్సైడ్‌ ‌సల్ఫర్‌ ‌డయాక్సైడ్‌, ‌పొగ, దుమ్ము, బూడిద, రిఫ్రిజిరేటర్లు ఏసీలు విమానాల నుండి వాతావరణంలోకి నైట్రస్‌ ఆక్సైడ్‌, ‌క్లోరో ఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్‌ ‌డై ఆక్సైడ్‌, ‌కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు, నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్‌ ‌వాయువు లు, గాలిలోకి విడుదల కాపాడుతాయి .మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

పర్యావరణాన్ని రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే: మొక్కలను విరివిగా పెంచి గాలి కాలుష్యాన్ని తగ్గించాలి.గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద పొడవైన చిమ్నీలను ఏర్పాటు చేయాలి .వాహనాలనుండి  వెలువడే కాలుష్య కారకాలను తగ్గించడానికి  కంప్రేస్స్ ‌డు నేచురల్‌ ‌గ్యాస్‌ ‌ను ఉపయోగించాలి. గృహ అవసరాలైన వంటకు ఎల్‌ ‌పి జి ఉపయోగించాలి.వాహనాలకు సీసం లేని పెట్రోల్‌ ‌ను ఉపయోగించాలి. పునరుద్దరింపదగిన శక్తి వనరులైన సౌర శక్తి, పవన శక్తి, అలల శక్తి జలవిద్యుత్‌ ‌ను ఉపయోగించుకోవాలి. నీటిని తక్కువగా వాడి నీటిని కలుషితం కాకుండా చేసి నీటి వృధాను అరికట్టాలి .అదిక కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించి నేల  సారాన్ని, చెట్లు అదికంగా పెంచి నేల  క్రమక్షయాన్ని, తగ్గించాలి .విద్యుత్‌ ‌ను వృదా చేయకుండా పొదుపుగా వాడుకొని సహజ వనరులను కాపాడాలి .ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని తగ్గించి మట్టి లో కలిసి పోయే వస్తువులను వాడాలి .

nerupati aanandh

Leave a Reply