Take a fresh look at your lifestyle.

రామ్‌గోపాల్‌ ‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

  • డెక్కన్‌ ‌నైట్‌ ‌వేర్‌ ‌స్టోర్‌లో మంటలు
  • భారీగా ఎగిసిపడ్డ మంటలు..అయిదంతస్తుల భవనం దగ్ధం
  • మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు?
  • భయబ్రాంతులకు గురయిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు
  • మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ ‌సిబ్బంది తీవ్ర కృషి
  • సహాయక చర్యల్లో పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు
  • సమీపంలోని భవనాలను ఖాళీ చేయించిన సిబ్బంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : సికింద్రాబాద్‌ ‌లోని రామ్‌గోపాల్‌ ‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్టలోని డెక్కన్‌ ‌నైట్‌ ‌వేర్‌ ‌స్టోర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్‌ ‌సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సమన్వయంతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా దాదాపుగా 7, 8గంటల వరకు కూడా అదుపులోకి రాలేదు. దాదాపు ఇరవై ఐదు ఫైర్‌ ఇం‌జన్లతో సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పక్కన కూడా మొత్తం రెసిడెన్షియల్‌ ‌భవనాలు ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా వాటిలోని నివాసితులను ఖాళీ చేయించారు.

ప్రమాదానికి గురయిన అయిందస్తుల భవనంలో పెద్ద ఎతున రెక్సిన్‌, ‌ప్లాస్టిక్‌, ‌పాలియెస్టర్‌ ‌లాంటి మంటలు సులభంగా అంటుకునే ముడి పదార్థాలతో తయారయిన కార్‌ ‌డెకార్‌ ‌వస్తువులు, దుస్తుల స్టాక్‌ ఉం‌డడంతో అన్ని అంతస్తులకు మంటలు వ్యాపించి చాలా సమయం వరకు అదుపు చేయలేని స్థితి ఏర్పడింది. ఒక దశలో భవనం నుంచి పెద్దఎత్తున పేలుళ్లు సంభవించడంతో పైర్‌ ‌సిబ్బంది, పోలీసులు, మీడియా వ్యక్తులు సైతం దూరం పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. డెక్కన్‌ ‌నైట్‌ ‌వేర్‌ ‌స్టోర్‌లో ఎవరైనా చిక్కుకున్నారా? అనేది ఇంకా తెలియాల్సింది. అయితే ఇద్దరు, ముగ్గురు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వారినికాపదేందుకు రెస్క్యూ టీం శ్రమిస్తుంది. కాగా అక్కడే వున్న షాపులో వున్న వారిని పోలీసులు తరలించారు. అయితే షాప్‌ ‌మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాప్‌ ఉన్న భవనం మొత్తం తగులబడటంతో భారీ నష్టం జరిగిందని షాపు యజమాని తెలిపాడు. అయితే భవనం మొత్తం మంటలు పెద్ద ఎత్తున అంటుకుని పూర్తిగా కాలి మసకబారిపోవడంతో కుపకూలి పక్కన ఉన్న భవనాలపై పడే ప్రమాదం పొంచి ఉండడంతో వాటిలో నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఒకవేళ భవనం కూలిన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాడానికి రెస్క్యూ టీమ్‌లను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇక షాప్‌లో షార్ట్ ‌సర్క్యూట్‌ ‌వల్ల ప్రమాదం జరిగిందా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన  సహాయక చర్యలు చేపట్టారు. అవకాశమున్న అన్ని ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇం‌జన్లను రప్పించారు. వాటికి కావాల్సిన నీటి కోసం పెద్ద ఎతుతన వాటర్‌ ‌ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. భారీ అగ్నిప్రమాదం కావడం వల్ల రోడ్లన్నీ స్థంబించాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కున్నారు. ట్రాఫిక్‌ ‌క్లియర్‌ ‌చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాదం సంభవించిన భవనానానికి అతి సమీపంలోనే నగరంలో అతి పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటయిన కిమ్స్ ‌హాస్పిటల్‌ ఉం‌డడం, దానిలో పెద్ద ఎత్తున ఇన్‌ ‌పేషంట్లు ఉండడం అక్కడి వరకు పొగ వ్యాపించే అవకాశం ఉండడంతో కొంత ఆందోళన నెలకొంది.

మంటలార్పడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు
మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ‌కష్టంగా మారింది. సంఘటనా స్థలంలో 25 ఫైరిరజన్లను అధికారులు మోహరించి.. భవనం మూడువైపులా మోహరించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పూర్తి స్థాయిలో శ్రమించారు. మరో వైపు రసాయనాలతోనూ అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. భారీ పొగ, మంటల కారణంగా భవనం వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతున్నది. పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురవగా.. వారిని హాస్పిటల్‌కి తరలించారు. సాయంత్రం 7 గంటల వరకూ మంటలు, దట్టమైన పొగ కొనసాగడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ‌కష్టంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్‌ ‌సరఫరాను నిలిపివేశారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అలాగే ఐదు అంబులెన్స్‌లను సంఘటనా స్థలం వద్ద సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యలను జీహెచ్‌ఎం‌సీ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జీహెహెచ్‌ఎం‌సీ డీఆర్‌ఎఫ్‌ ‌చీఫ్‌ ‌కంపాటి విశ్వజీత్‌ ‌మాట్లాడుతూ.. మంటల ఉధృతి ఎక్కువగా ఉండడంతో భవనం వద్దకు ఫైరిరజన్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్‌ ఆలస్యమవుతుందని చెప్పారు. ప్రాణనష్టం జరుగకుండా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. అవసరమైతే బిల్డింగ్‌ ‌విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. భవనం ఏక్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని, కూలిపోయినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply