హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్దారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నాడనే సమాచారంతోనే సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందారు.
తెలంగాణ గ్రేహౌండ్స్ సీఆర్పీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. హిడ్మా లక్ష్యంగా ప్రత్యేక హెలికాప్టర్లో సర్జికల్ స్ట్రెక్ చేశారు. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. హిడ్మాపై రూ. 45 లక్షల రివార్డు ఉంది. అయితే హిడ్మా ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుంది. ఈ భద్రతను చేధించుకుని పోలీసులు హిడ్మా ఆపరేషన్‌ను సక్సెస్ చేసినట్లు తెలుస్తుంది. హిడ్మా భద్రత దళాలకు మోస్ట్ వాంటెడ్. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుకా ఆయన హస్తం ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.