Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భారీ కుట్ర

బైలదిల్లా కోసం విశాఖను నష్టాల్లోకి నెట్టారు
బయ్యారం ఉక్కు సాధ్యం కాదని నివేదిక ఇచ్చారు
విభజన హాల్లో కడప, బయ్యారంలను విస్మరించారు
ఆత్మీయ ఆదానీ కోసం మోదీ వ్యాపార ఎత్తులు
దమ్ముంటే బైలదిల్లా ఒప్పందాలను రద్దు చేయాలి
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే విశాఖపై స్టడీ
డియా సమావేశంలో వెల్లడించిన మంత్రి కెటిఆర్‌
25‌న నియోజకవర్గ స్థాయిలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు
27న పార్టీ కార్యాలయంలో కెసిఆర్‌ ఆధ్వర్యంలో సభ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తన మిత్రుడు ఆదానీకి లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం నడుపుతున్నారని, ఈమేరకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మంతంరి సత్యవతి తదితరులతో కసలి డియాతో మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బీహెచ్‌ఇఎల్‌కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. బీమా పథకాలన్నీ ఎల్‌ఐసీకి అప్పగించారని, నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చినవారికి అప్పగించడం.. కేంద్రం ఆలోచనగా కనిపిస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో విమర్శించారు. బైలదిల్లా గనులను ఆదానీకి అప్పగించే క్రమంలో విశాఖను కూడా కట్టబెట్టే ప్రయత్నాల్లో భాగంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టీర ప్రైవేటీకరణ యత్నాలు సాగుతున్నాయని అన్నారు. సెయిల్‌ ‌ద్వారా బయ్యారంలో స్టీల్‌ ‌ఫ్యాక్టరీ పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బయ్యారం, కడపలో స్టీల్‌ ‌ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని..కేంద్రం హా ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నోసార్లు కలిశానని, బైలాదిల్లా నుంచి బయ్యారానికి.. 50 శాతం పైప్‌లైన్‌ ‌ఖర్చు భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి లాభం లేదని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే బయ్యారం వెనుక ఉన్న కుట్రను గుర్తించలేకపోయామని, 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్‌ ‌బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ ‌కంపెనీ పెట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను.. గుజరాత్‌లోని ముంద్రాకు తరలించేలా ప్రణాళిక చేశారని మంత్రి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని, అదానీ కోసమే విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. బైలదిల్లా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడిందని, నష్టాలను చూపించి దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోదీ విధానమని అన్నారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ చేస్తున్న కుట్రను..నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ ‌కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్రలను బహిర్గతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణ చేస్తే వొచ్చే సమస్యలేంటో సీఎం కేసీఆర్‌ ‌చాలా సార్లు చెప్పారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బిహెచ్‌ఇఎల్‌కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.
విశాఖ స్టీల్‌కు, బయ్యారం ఉక్కుకు చాలా వత్యాసం ఉందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. బండి సంజయ్‌ ఎప్పు‌డు ఏం మాట్లాడుతాడో ఆయనకే  తెలియదని విమర్శించారు. బయ్యారంలో ఇనుము నాణ్యత లేదని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఆదానీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కేటీఆర్‌ ‌విమర్శించారు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదానీకి అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న బైలదిల్లా పర్మిషన్‌ ‌రద్దు చేయాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇక  ఏప్రిల్‌ 27‌న తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ  జనరల్‌ ‌బాడీ టింగ్‌ ఉం‌టుందని కేటీఆర్‌ ‌తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ ‌వార్డులో ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఎగురవేసి..సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్‌ఛార్జిలదే అని మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి సూచించారు.

ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన డియాతో మాట్లాడారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ ‌నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి.. పలు అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుపుతామని వెల్లడించారు. 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలపై సావధానంగా చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించడం జరుగుతుందని చెప్పారు. ’ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించాం. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేశాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వొచ్చిన చిన్న ఇబ్బందులను కరెక్ట్ ‌చేసుకుని ముందుకెళ్తామని తెలిపారు.

Leave a Reply