ఇంపాల్, ఫిబ్రవరి 4 : మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఆదివారం బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫ్యాషన్ షో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ షో వేదిక వద్ద శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది. తెల్లవారుజామున 6.30 నిమిషాలకు వేదికకు సుమారు వంద టర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల ఎవరూ గాయపడలేదని తెలిసింది. హట్టా కంజిబుంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.అయితే ఆ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఐఈడీ లేక గ్రానైడ్ వల్ల ఆ పేలుడు సంభవించిందా అన్న విషయం తేలాల్సి ఉంది. పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు మిలిటెంట్ సంస్థలు ప్రకటించలేదు.