Take a fresh look at your lifestyle.

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

‘‘‌హఠాత్తుగా సిలబస్‌ ‌లో మార్పులు చేయటం రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసినంత సులువు కాదు. ఆయా సంబంధిత విషయాలను కూర్చిన విషయ నిపుణులు,మేధోవర్గ ప్రతినిధులు,ఆచార్యుల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా హఠాత్తుగా ఈ సిలబస్‌ ‌తొలగింపులు, మార్పులు ఏ వర్గ ప్రయోజనాల కోసం చేయబడ్డాయనేది బహిర్గతం కావాలి. తొలగించిన అధ్యాయాలు ప్రస్తుత పాలకులు భావజాలానికి భిన్నంగా ఉండటంతో ఈ తొలగింపుల వెనుక ఉన్న కారణాలు ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు లోబడి చేసినవే అనేది స్పష్టం అవుతుంది… ’’

– అజయ్‌
‌తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌.

జాతీయ విద్యా విధానం 2020 అమలు పేరిట ఏ అంతర్గతలక్ష్యాల సాధనకు బి.జె.పి.రంగం సిద్దం చేసిందో,దాని ఆచరణలో ఏ దుందుడుకు వైఖరితో భవిష్యత్తు ప్రణాలిక సాధనకు ఉవ్విళ్ళూరుతుందో ఆయా రహస్య ఎజెండాల అమలుకు తమదైన కార్యాచరణలను దూకుడుగా ముందుకు తెస్తున్నది.అమిత్‌ ‌షా కమిటీ సిఫార్సుల పేరుతో  దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి లోనే మాతృభాషలకు ఉరి బిగించింది.నేడు కళాశాల స్థాయి విద్యను మరింత కాషాయీకరించేందుకు చరిత్ర, విజ్ఞాన శాస్త్రాలలో సిలబస్‌ ‌లలో మార్పులకు సిద్దపడింది. భారతదేశ చరిత్రలో ఏ వరుస క్రమాన్ని విస్మరించినా తదుపరి చరిత్ర అవగాహనకు అవరోధం తప్పక ఏర్పడుతుంది.  కీ.శ.1526 నుండి 1707మధ్య దాదాపు 180 సంవత్సరాలు భారత ఉపఖండాన్ని (ఆఫ్ఘనిస్తాన్‌, ‌పాకిస్తాన్‌, ‌భారత్‌) ‌పరిపాలించిన మొఘలు రాజవంశీయుల చరిత్రను సిలబస్‌ ‌లో నుండి తొలగించటం,జీవుల పరిణామం గూర్చి మానవాళి మనుగడకు సవాలుగా నిలుస్తున్న అనేక సమస్యలకు సమాధానం చూపే డార్విన్‌ ‌జీవ పరిణామ సిద్ధాంతం తొలగించటం వెనుక ఏ అంతర్గత ప్రయోజనాలు దాగున్నాయో, వాటి అంతిమ లక్ష్యాలు ఏమిటో తెలియనిది కాదు.

ఏం జరిగింది !….
విద్యార్థులపై భారాన్ని తగ్గించడంతో పాటు..సిలబస్‌?‌ను సవరించడానికి  మొఘల్‌ ‌సామ్రాజ్యం పాఠంలోని కొన్ని ఆధ్యాయాలను తొలగించామని కోవిడ్‌-19 ‌మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన విద్యార్థులపై భారాన్ని తగ్గించడానికి ‘‘వృత్తిపరమైన వ్యాయామం’’లో భాగంగా ఈ పాఠ్యపుస్తకాలను సవరించినట్లు  NCERT డైరెక్టర్‌ ‌దినేష్‌ ‌ప్రసాద్‌ ‌సక్లానీ చెప్పారు.నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌ట్రైనింగ్‌ NCERT మొఘల్‌ ‌సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించి 12వ తరగతి చరిత్ర పుస్తకంతో సహా తన పుస్తకాలను సవరించింది.దేశ వ్యాప్తంగా  NCERT•ని అనుసరించే అన్ని పాఠశాలలకు ఈ మార్పు వర్తిస్తుంది.12వ.తరగతి నుండి, ‘కింగ్స్ అం‌డ్‌ ‌క్రానికల్స్’‌కి సంబంధించిన అధ్యాయాలుబీమొఘల్‌ ‌కోర్టులు (16వ మరియు 17వ శతాబ్దాలు)’ చరిత్ర పుస్తకం ‘థీమ్స్ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌హిస్టరీ-పార్ట్ 2’ ‌నుండి  తొలగించబడ్డాయి. అదేవిధంగా,NCERT హిందీ పాఠ్య పుస్తకాల నుండి కూడా కొన్ని కవితలు మరియు పేరాల ను తొలగిస్తుంది.హిస్టరీ, హిందీ పాఠ్యపుస్తకాలతో పాటు 12వ తరగతి పౌరశాస్త్రం పుస్తకాన్ని కూడా సవరించారు.

పుస్తకం నుండి ‘అమెరికన్‌ ‌హెజిమోనీ ఇన్‌ ‌వరల్డ్ ‌పాలిటిక్స్’ ‌మరియు ‘ది కోల్డ్ ‌వార్‌ ఎరా’ అనే రెండు అధ్యాయాలను తొలగించారు.మార్పులతో కొనసాగుతూ,12వ తరగతి పాఠ్యపుస్తకం ‘ఇండియన్‌ ‌పాలిటిక్స్ ఆఫ్టర్‌ ఇం‌డిపెండెన్స్’ ‌నుండి ‘రైజ్‌ ఆఫ్‌ ‌పాపులర్‌ ‌మూవ్‌మెంట్స్’ ‌మరియు ‘ఎరా ఆఫ్‌ ‌వన్‌ ‌పార్టీ డామినెన్స్’ అనే రెండు అధ్యాయాలు కూడా తొలగించ బడ్డాయి.10వ తరగతి, 11వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు చేశారు. 10వ తరగతి పుస్తకం ‘డెమోక్రటిక్‌ ‌పాలిటిక్స్-2’ ‌నుంచి ‘ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం’, ‘ప్రజాపోరాటాలు మరియు ఉద్యమాలు’, ‘ప్రజాస్వామ్య సవాళ్లు’ వంటి అధ్యాయాలను తొలగించారు. 11వ తరగతి పాఠ్యపుస్తకం ‘థీమ్స్ ఇన్‌ ‌వరల్డ్ ‌హిస్టరీ’ నుండి ‘సెంట్రల్‌ ఇస్లామిక్‌ ‌ల్యాండ్స్’, ‘‌క్లాష్‌ ఆఫ్‌ ‌కల్చర్స్’ ‌మరియు ‘ఇండస్ట్రియల్‌ ‌రివల్యూషన్‌’ ‌వంటి అధ్యాయాలు తొలగించబడ్డాయి.ఈ మార్పులను ధృవీకరిస్తూ, కొత్త సిలబస్‌ ‌మరియు పాఠ్యపుస్తకాలు ఈ సంవత్సరం నుండి నవీకరించబడ్డాయని, వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్నాయని సీనియర్‌ అధికారులు తెలిపారు.

ప్రస్తుత పాఠ్యంశాలు సవరించమని గాని, తొలగించమని గాని..ఏం విద్యావేత్తలైనా కోరారా! పాఠ్యాంశాలను సిద్దం చేసే విద్యావేత్తలు ఈ మార్పులను మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రభుత్వం ఒంటెద్దు వైఖరిగా భావించక తప్పదు.ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని  NCERT  పేర్కొంది. మొఘల్‌ ‌సామ్రాజ్యం చాప్టర్లను తొలగించడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని  ‘‘ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి, సమాజం, దేశం పట్ల బాధ్యతగా, పాఠ్యపుస్తకాలలోని కంటెంట్‌ ‌లోడ్‌ ‌తగ్గించాలని భావించాం’’ అని సక్లానీ పేర్కొన్నారు. ఈ మార్పులు చేయకపోతే ఎన్‌ ‌సి ఇ ఆర్‌ ‌టి పుస్తకాలను సిలబస్‌ ‌లోకి తీసుకోమని ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం చెప్పటమే తెరవెనుక కారణమనితెలుస్తోంది. రోమిల్లా థాపర్‌,ఇర్ఫాన్‌ ‌హబీబ్‌, అధిత్య ముఖర్జీ, బర్బరా మెట్‌ ‌ఖాఫ్‌, ‌దిలీప్‌ ‌సైమన్‌, ‌మృదిలా ముఖర్జీ ఉమేష్‌ ‌కాడం.అర్చనా వర్మ,శృతి మిశ్రా,ఆర్‌. ‌కె.పూరమ్‌,‌కృష్ణ రంజన్‌, ‌సునీల్‌ ‌కుమార్‌ ‌మొదలైన 250 మంది చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకులు మేధావులు ఈ తొలగింపులను ఖండిస్తూ వెంటనే ప్రకటన చేశారు.

– మిగతా రేపటి సంచికలో 

Leave a Reply