భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని గురువారం ఇండియ పర్యటనలో భాగంగా అమెరికా కు చెందిన విదేశీయుల బృందం సందర్శించారు.అనంతరం స్థానిక టూరిజం పార్కులోని వస్త్రాల తయారీ, నూలు దారాన్ని, రంగులు ఆద్దకం, వార్పును, మగ్గం పై నేత వేసే ప్రక్రియను వారు పరిశీలించారు. కళాకారులు కళాత్మకంగా తయారు చేస్తున్న ప్రక్రియను చూసి వారు మంత్రముగ్దుల య్యారు. చేనేత కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయ అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ రాజ్ కత్రియన్ యట్స్,డేనియల్,హారలౌ,రిక్ బౌచర్డ్,పార్క్ మేనేజర్ జితేందర్ పాల్గొన్నారు.
Tags: foreigners ,visited Pochampally,the tourism park,Naveen Raj Kathryn Yeats, Daniel, Harlow, Rick Bouchard, Park Manager Zeitinder