Take a fresh look at your lifestyle.

కుల వివక్షపై పోరాడిన మహానుభావుడు

  • పూలే జీవితం ఆదర్శప్రాయం
  • సిఎం కెసిఆర్‌ ‌నివాళి

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని సీఎం తెలిపారు. కుల,లింగ వివక్షకు తావు లేకుండా, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా ఫూలే ఆలోచన విధానాన్నే స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. కుల వృత్తులకు సామాజిక గౌరవం ఆర్ధిక గౌరవాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆరున్నర ఏండ్ల తెలంగాణ స్వయం పాలనా పక్రియ, ఫూలే వంటి మహనీయుల స్పూర్తితోనే కొనసాగుతున్నదని సీఎం అన్నారు..

Leave a Reply