Take a fresh look at your lifestyle.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

రామన్నపేట మే 6 (ప్రజాతంత్ర విలేకరి) అకస్మాత్తుగా బుధవారం కురిసిన వర్షానికి మండలంలోని రామన్నపేట, నిర్నేముల, దుబ్బాక, తదితర ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. సాయంకాలం దాదాపు గంటపాటు అకస్మాత్తుగా వర్షం కురవడంతో సరిపడా టార్పంలిన్‌ ‌లేక ఆరబెట్టిన ధాన్యంతడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలువురు రైతులు అధికారులను కోరారు. ధాన్యం రాశులు వద్ద రైతుల ఇబ్బందులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డులో పిఎసిఎస్‌ ‌ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఎమ్మెందుకని  తెచ్చిన ధాన్యం ఆ మార్కెట్‌ ‌యార్డ్ ‌లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కుప్పలు పోశారు.

బుధవారం సాయంత్రం సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి వర్షం కురవడంతో కంగారుపడిన రైతులు వెంటనే వాటిపై పట్టాలు కప్పేశారు. దీంతో అకస్మాత్తుగా వచ్చిన వర్షం కారణంగా కొంత మేరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. దుబ్బాక ఐకేవపి కేంద్రాన్ని స్థానిక ఎంపిటిసి మడూరి జ్యోతిరామచందర్‌ ‌రావు, నీర్నేములలో సర్పంచ్‌ ‌ముత్యాల సుజాతరవి సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను పరామర్శించి ధాన్యం కొనుగోలు చేసేవిధంగా అధికారులతో మాట్లాడుతామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

error: Content is protected !!