ఆడపిల్లంటే అబల కాదు
సబల అనే విధంగా
అబ్బాయిలతో పాటు
అన్ని రంగాల్లో
రాణిస్తున్నారు
పవిత్రమైన భారత దేశంలో
స్త్రీని దేవత రూపంలో
పూజించే సంస్కృతి
మనది
ప్రతి ఒక్క ఆడపిల్ల
ముఖంలో తల్లిని చూసుకుంటాం
ఈ సృష్టికి మూలం
మహిళలే ఆధారం
నేటి సమాజంలో
పసి పిల్లలని
చెత్త కుప్పలో, ముళ్ళపోదలో
వదిలి వెళ్తున్నారు
రోజుకు స్త్రీల పైన ఎన్నో
ఆఘాయిత్యలు జరుగుతున్నాయి
ఎందరో వివక్షతకు గురవుతూ
మానవ మృగాల చేతిలో
బలి అవుతున్నారు
మహిళల్లో చైతన్యం రావడం లేదు
లక్ష్మి బాయి, రాణి రుద్రమదేవి
దుర్గాబాయి దేశ ముఖ్, చాకలి ఐలమ్మ
వంటి వారు శత్రువులను
చీల్చి చెండాడారు
అదే స్పూర్తితో కదులుదాం
స్త్రీలంతా ఏకమై ఒక్క సారిగా
గర్జిస్తే లోక మంతా
ఉలిక్కి పడాలి
కదిలి రండి కదం తోక్కుతూ!
ఐక్యతను చాటండి
లోకం మీ వెంట నడుస్తుంది!!
– మిద్దె సురేష్
కాకతీయ యూనివర్సిటీ
9701209355